Health Problems Warning Symptoms : మన ఆరోగ్యం గురించి అవయవాలు నిత్యం అలర్ట్ చేస్తూనే ఉంటాయి. ఎక్కడ ఇబ్బందిగా ఉందో.. ఏం జరుగుతుందో చెప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. కానీ.. జనమే వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. వయసుతో సంబంధం లేకుండా ఈ పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి. దీనివల్ల.. యాభై ఏళ్లు దాటితేనే వచ్చే అనారోగ్య సమస్యలు.. ఇప్పుడు ముప్పయ్యేళ్లలోనే మొదలైపోతున్నాయి.
అందువల్ల శరీరం చేసే హెచ్చరికలను కచ్చితంగా అందరూ గమనించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీ శరీరంలో ఏవైనా మార్పులు ఆకస్మాత్తుగా కనిపిస్తే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే.. మీ ఆరోగ్యం గురించి అందరికంటే మీకే బాగా తెలుసు. కాబట్టి.. వచ్చే హెచ్చరిక ఆధారంగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి పనుల వల్ల ఆ సమస్య వచ్చిందో గుర్తించి.. వాటిని సరిచేసుకోవాలని చెబుతున్నారు. లేదంటే.. ఒక్కోసారి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇందులో మరీ ప్రమాదకరమైన లక్షణాలను అస్సలే నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు. మరి.. ఆ లక్షణాలేంటి? వాటి ద్వారా కలిగే అనారోగ్య సమస్యలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం..
తిన్న తర్వాత కూల్డ్రింక్స్, సోడా తాగుతున్నారా? - అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే!
- మీ గోళ్ల రంగు పూర్తి తెల్లగా మారిపోతే కాలేయం, సగం పింక్ కలర్లోకి మారితే కిడ్నీ సమ్యసలు ఉన్నాయేమో చూసుకోవాలి.
- అవసరమైతే వైద్యుడిని సంప్రదించి టెస్టు చేయించుకొని చికిత్స తీసుకోవాలి.
- ఇకపోతే మీ పెదవులు పొడిబారుతుంటే.. మీ శరీరంలో విటమిన్స్ తగ్గినట్లే అని గుర్తుంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ సమస్య కూడా తలెత్తినట్టే అంటున్నారు. ఇలా కనిపిస్తే డాక్టర్ను సంప్రదించాలని చెబుతున్నారు.
- మీ పాదాలు చల్లగా అవుతుంటే గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోండి. లేదంటే తీవ్ర అనర్థాలు ఎదుర్కొవాల్సి రావొచ్చు.
- ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే సమస్య జుట్టురాలడం. కానీ, ఆకస్మాత్తుగా మీ జుట్టు రాలిపోవడం ఎక్కువైతే మాత్రం సందేహించాల్సిందే. అలా అనిపిస్తే ఒకసారి థైరాయిడ్, షుగర్ టెస్ట్ చేయించుకోండి.
- అదేవిధంగా మీ కళ్లు పసుపు రంగులోకి మారితే కామెర్లు, కాలేయం, గాల్ బ్లాడర్ సమస్యలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి.
- శరీరంపై అనేక కారణాల వల్ల మచ్చలు ఏర్పడతాయి. కానీ.. మీ బాడీపై నల్లమచ్చలు ఎక్కువవుతుంటే మీకు మెలనోమా అనే చర్మవ్యాధి సోకిందేమో టెస్ట్ చేయించుకోవాలి.
- ఇక చివరగా ఏ కారణం లేకుండా మీ మెడ వాచినట్టైతే ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి.
- ఇలా పైన పేర్కొన్న లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.