‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’... సినిమాలతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక. ఆకట్టుకునే అందం, అలరించే అభినయంతో పాటు తనకు మాత్రమే సాధ్యమయ్యేలా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అశేష అభిమానులను సొంతం చేసుకుందీ అందాల తార. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ బ్యూటీ గతంలో చర్మ సంరక్షణ విషయంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని అందరితో షేర్ చేసుకుంది.
నా చర్మంలో చాలా మార్పులొచ్చాయి!
‘చర్మ సంరక్షణ విషయంలో భారతీయులు ఓ రకంగా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫుడ్ అలర్జీకి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు ఇక్కడి వారిలో ఉండవు. అయితే కొద్దిమందికి మాత్రమే ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. ఉదాహరణకు కీరా దోస, టొమాటో, క్యాప్సికమ్, బంగాళా దుంప (ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా మిస్సయ్యాను) వంటి కూరగాయలు తింటే నాకు అస్సలు పడవు. రెండేళ్ల క్రితమే ఈ విషయం నాకు తెలిసింది. ఆ సమయంలో నా చర్మంలో చాలా మార్పులు కనిపించాయి.
ఎందుకిలా జరుగుతోందో...
చర్మ సంరక్షణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎందుకిలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు. వెంటనే అలర్జీ టెస్ట్ చేయించుకున్నా. నేను తీసుకునే ఆహారంలోనే అసలు సమస్య ఉందని, అందుకే చర్మ సమస్యలు ఎదురయ్యాయని అందులో తేలింది. వెంటనే నా శరీరతత్వానికి సరిపడని ఆహారాన్ని పక్కన పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్లీ నాకెలాంటి చర్మ సమస్యలు ఎదురుకాలేదు. కాబట్టి మీ చర్మం రఫ్‌గా తయారవుతున్నా... డల్‌గా కనిపిస్తున్నా ముందు వెళ్లి అలర్జీ టెస్ట్ చేయించుకోండి’ అని పోస్ట్‌లో భాగంగా రాసుకొచ్చింది రష్మిక.
కనీసం 2 లీటర్ల నీరు తాగండి!
దీంతో పాటు చర్మ సంరక్షణకు సంబంధించి కొన్ని చిట్కాలు కూడా అభిమానులతో షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ. అవేంటంటే..!