శరీరాన్ని ముందుగా వ్యాయామానికి సిద్ధం చేయకుండా నేరుగా కసరత్తులు (warm up exercise) మొదలుపెట్టకూడదు. వార్మప్ (warm up exercise before workout) చేయడం వల్ల కసరత్తులు చేయడానికి అనువుగా కండరాలు (full body warm up exercise) సిద్ధమవుతాయి. వాటికి ఆక్సిజన్ సరఫరా అవుతుంది. రక్తప్రసరణ సాఫీగా సాగి, గుండె కొట్టుకునే వేగం, శరీర ఉష్ణోగ్రత పెరిగి, అనారోగ్యాల బారినపడే (warm up exercise uses) అవకాశం తగ్గుతుంది. అందుకే వ్యాయామానికి ముందు కనీసం పావుగంటసేపైనా వార్మప్ చేయాలి.
ఇలా చేయండి
- కాళ్లు కొంచెం ఎడంగా పెట్టి చేతులను జతచేసి పైకి లేపి కుడి సైడ్లోకి బెండ్ అవ్వాలి. మరల అదే విధంగా శరీరాన్ని ఎడమ సైడ్కు బెండ్ చేయాలి. నెమ్మదిగా పైకి లేవాలి.
- చేతులను జతచేసి పైకి లేపాలి. అనంతరం శరీరాన్ని వెనకవైపుకి నెమ్మదిగా బెండ్ చేయాలి. అంతే నెమ్మదిగా యథాస్థానానికి రావాలి.
- చేతులను పైకి లేపి నడుము పైభాగాన్ని ముందుకు వంచాలి. వెన్నెముకను సరిగా ఉంచుకునేలా చూడాలి. అనంతరం శరీరాన్ని యథావిధిగా పైకి తీసుకురావాలి.
- కుడికాలుని మోకాలుపై ఉంచి, ఎడమ కాలుని వెనుకకు ఉంచి స్ట్రెచ్ చేయాలి. అనంతరం చేతులను పైకి లేపి వెనుకకు వీలైనంత బెండ్ చేయాలి.
- ఎడమకాలుని మోకాలుపై ఉంచి, కుడి కాలుని వెనుకకు ఉంచి స్ట్రెచ్ చేయాలి. అనంతరం చేతులను పైకి లేపి వెనుకకు వీలైనంత బెండ్ చేయాలి.
- కాళ్లను కొంత స్ట్రెచ్ చేసి కుడి చేతిని పైకి లేపి ఎడమ చేతిని ఎడమ కాలుపై ఉంచి శరీరాన్ని ఎడమ వైపుకు బెండ్ చేయాలి.
- కాళ్లను కొంత స్ట్రెచ్ చేసి ఎడమ చేతిని పైకి లేపి కుడి చేతిని కుడి కాలుపై ఉంచి శరీరాన్ని కుడి వైపుకి బెండ్ చేయాలి.