మహిళలకు వక్షోజాల పరిమాణం విషయంలో ఎన్నో అపోహలుంటాయి. తమ స్తనాలు చిన్నగా ఉన్నాయని కొందరు ఫీలైతే.. మరికొందరు పెద్దగా ఉన్నాయని బాధపడుతుంటారు. ఇలా ఈ విషయంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి. మరి కొందరు చిన్న వక్షోజాలు ఉంటే బిడ్డకు పాలు తక్కువగా వస్తాయా? చిన్నవిగా ఉంటే రతిలో ఎక్కువ సేపు పాల్గొనలేమా? ఇలాంటి అపోహలు పడుతుంటారు. కానీ చాలా మంది ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. ముఖ్యంగా తమ స్తనాల గురించి వాళ్లకు తెలియని విషయాలెన్నో ఉంటాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
వక్షోజాల సౌందర్యం కాపాడుకోవడం ఎలా?
వక్షోజాలను కాపాడుకోవాలంటే చక్కని ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల వక్షోజాలు బిగుతుగా, మంచి ఆకృతిలో ఉంటాయి. జిమ్, స్విమ్మింగ్, ఇతర వ్యాయామాలు చేసిన మహిళలలో వక్షోజాలు కింద కండరాలు బలంగా తయారవుతాయి. దీంతో వారి వక్షోజాలు సౌందర్యంగా మారతాయి.
వక్షోజాలు చిన్నవిగా ఉంటే సెక్స్‌ను ఎక్కువ సేపు ఆస్వాదించలేరా?
వక్షోజాల పరిమాణానికి, సెక్స్‌కు ఎటువంటి సంబంధం లేదు. స్తనాల్లో.. సెక్స్ ప్రేరణ అనేది చనుమొనల్లో కలుగుతుంది. అంతే గానీ స్తనాల పరిమాణాన్ని బట్టి సెక్స్ చేసే సమయం ఆధారపడదు. చనుమొనలలోనే కామనాడులు ఎక్కువగా ఉంటాయి. చిన్న చనుమొనలు ఉన్నవారికైనా, పెద్ద చనుమొనలు ఉన్నవారికైనా ఒకే రకమైన సెక్స్ ప్రేరణ ఉంటుంది. మగవారిని ఆకర్షించడానికి పెద్ద స్తనాలు ఉపయోగపడతాయి తప్ప రతిలో పాల్గొనాలంటే మాత్రం చనుమొనల సైజుతో సంబంధం లేదు.