తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

నైట్​షిఫ్ట్​ చేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు మస్ట్ - లేకుంటే అంతే! - Night shift Care Tips

Night Shift Care Tips : ఇప్పుడు పురుషులతోపాటు.. మహిళలు కూడా రాత్రి వేళల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మరి నైట్ షిఫ్ట్ కారణంగా ఎలాంటి మార్పులు వస్తాయి? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

night shift health care tips
night shift health care tips

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 1:58 PM IST

How to Take Care if You are in Night Shift : ఒకప్పుడు ఉద్యోగం అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. కానీ ఇప్పుడు 24/7 షిఫ్టుల వారీగా వర్క్ నడుస్తోంది. చాలా రంగాల్లో ఈ పరిస్థితి ఉంది. అయితే.. ఇతర షిఫ్టుల సంగతి ఎలా ఉన్నా నైట్‌ షిప్ట్‌ తో పలు సమస్యలు తలెత్తుతుంటాయి. ఇందులో ప్రధానమైనది ఆరోగ్య సమస్య. దీర్ఘకాలంలో.. డయాబెటిస్, అధిక బరువు, జీర్ణకోశ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటి చాలా సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల.. నైట్‌షిప్ట్‌లో పని చేసే వారు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

టైమ్ మెనేజ్​మెంట్​:మీరు నైట్​ షిఫ్ట్​లు చేస్తుంటే.. ఒక టైమ్ టేబుల్​ ఫిక్స్​ చేసుకోవడం బెటర్​. తద్వారా మీరు చేయాలనుకున్న పనులన్నీ టైమ్​ కి పూర్తి అవుతాయి. అంటే నిద్ర, వ్యాయామం, ఇంటి పనులు, ఇతర ముఖ్యమైన పనులన్నీ కంప్లీట్​ చేసుకోవచ్చు.

తగినంత నిద్ర :నైట్ షిఫ్ట్‏ చేసేవారు పగటి సమయంలో తగినంత నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీంతో బలహీనంగా మారిపోతారు. అందుకే రాత్రిళ్లు చురుకుగా పనిచేయాలంటే పగటి నిద్ర అవసరం. అంతేకాకుండా మీరు మధ్యాహ్నం సమయంలో నిద్ర పోవాలనుకున్నప్పుడు ప్రశాంత వాతావరణంలో నిద్రించే విధంగా చూసుకోవాలి. ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటే.. అంత ప్రశాంతమైన నిద్ర పోవచ్చు. తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు.

ఫుడ్​ విషయంలో జాగ్రత్త:ఎసిడిటీ, అజీర్తి అనేవి రాత్రి షిఫ్టులలో పనిచేసే వ్యక్తులు ఎక్కువగా ఎదుర్కొనే సాధారణ సమస్యలు. ఇవి ఊబకాయం, ఇంకా ఇతర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాత్రి సమయంలో తీసుకునే ఆహారం విషయమై జాగ్రత్త తీసుకోవాలి. నైట్ షిఫ్ట్ చేసే సమయంలో జంక్ ఫుడ్‏కు దూరంగా ఉండాలి. రాత్రి సమయంలో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. వేయించిన ఆహారం తీసుకోకుడదు. తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల కళ్లకు సైతం మంచిది. అలాగే మీరు రోజూ తీసుకునే ఆహారంలో పండ్లను జత చేసుకోవాలి. రాత్రిళ్లు పనిచేసే వాళ్లు ఎక్కువగా పండ్లను తినడం వలన ఉత్సాహంగా ఉంటారు.

వ్యాయామం:నైట్ షిఫ్ట్ చేసేవారు ఉదయాన్నే వ్యాయమం చేయలేరు. కానీ.. టైమ్ సెట్ చేసుకొని రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయమం చేయాలి. యోగా చేయడానికి ఒక నిర్ణీత సమయాన్ని అలవరుచుకోవాలి. రాత్రిళ్లు పని చేయడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకే రోజుకు కొద్ది సమయం వ్యాయమానికి కేటాయించాలి.

తగిన మోతాదులో నీరు:ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు.. రాత్రి సమయంలో ఎనర్జిటిక్​గా ఉండటానికి మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. నైట్ షిఫ్ట్ చేసేవారు ఎక్కువగా టీ, కాఫీ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. అందుకు బదులుగా రాత్రిళ్లు ఎక్కువగా నీరు తాగాలి.

ఫ్యామిలీ సపోర్ట్​:నైట్​ షిఫ్ట్​లు చేసేవారికి కచ్చితంగా కుటుంబం నుంచి సహకారం ఉండాలి. ఎందుకంటే.. ఇంట్లో సపోర్ట్​ ఉంటే.. ఆఫీసులో ఎటువంటి టెన్షన్​ లేకుండా వర్క్​ చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో.. ఇది చాలా అవసరం. పిల్లల ఆహారం, నిద్ర, ఇతర పనుల విషయంలో భర్తకు భార్య, భార్యకు భర్త తోడ్పాటు అందిస్తే ఈజీగా ఉంటుంది.

ఫోన్లో యాడ్స్​తో చిరాకొస్తోందా? - ఈ చిన్న చేంజ్​ చేస్తే యాడ్స్ బంద్​!

బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేసి ఉంచడం లాభమా? నష్టమా?

వారానికి 70 గంటలు పనిచేస్తే - ధనికులయ్యేది ఉద్యోగులా? యజమానులా?

ABOUT THE AUTHOR

...view details