Best Tips for Tomato Storing :ఒక కూరలో తోడుగా మరో కూరగాయను వేయాల్సి వస్తే.. అందరూ చూసేది టమాటా వైపే. దాని టేస్ట్ కర్రీకి అడిషనల్ ఫ్లేవర్ అందిస్తుంది. అందుకే.. చాలా మంది ప్రతి రోజూ చేసే వంటకాల్లో.. టమాటాను మాగ్జిమమ్ యూజ్ చేస్తుంటారు. టమాటాలు ఆరోగ్యంతోపాటు చర్మానికి మేని ఛాయను అందించడంలోనూ సహకరిస్తాయి. అందుకేటమాటాలను(Tomatoes)మిగతా కూరగాయల కంటే ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటారు. అయితే.. వాటిని నిల్వ ఉంచడమే అసలు సమస్య! సరిగ్గా స్టోర్ చేయకపోవడంతో.. త్వరగా పాడైపోతుంటాయి.
Tomato Store Tips for Long Time : ధర తక్కువగా ఉన్నప్పుడు సరే.. కానీ పెరుగుతున్నప్పుడు పరిస్థితి మొత్తం మారిపోతుంది. సామాన్యుడు కొనలేని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు టమాటాలు త్వరగా పాడైపోయి, బయట పడేయాల్సి వస్తే ఇబ్బందిగా ఉంటుంది. డబ్బు వేస్ట్ అయిపోతుంది. అందుకే.. టమాటాలను చాలా కాలం తాజాగా ఉంచడం ముఖ్యం. దీనికోసం మేం చెప్పే టిప్స్ పాటిస్తే చాలు. మరి.. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాలిథిన్ సంచుల్లో భద్రపరచండి :టమాటాలు తాజాగా ఉండాలంటే బాక్సుల్లో, పాలిథిన్ సంచుల్లో, ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. త్వరగా పాడవుతున్నాయని భావిస్తే.. వీటిని పాలిథిన్ సంచిలో భద్రపరుచుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి. టమాటాలను చాలా కాలం స్టోర్ చేసుకోవడానికి పాలిథిన్ సంచులు బెస్ట్ ఆప్షన్.
పసుపు నీటిలో కడగండి : టమాటాలు త్వరగా పాడవకుండా ఉండాలంటే.. మార్కెట్ నుంచి తెచ్చాక వాటిని పసుపు నీటిలో కడగాలి. ఆ తర్వాత గాలికి ఆరబెట్టాలి. ఇలా చేయడం ద్వారా అవి త్వరగా కుల్లిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ పద్ధతిని అలవాటు చేసుకున్నారంటే.. మీరు తెచ్చిన టమాటాలు పాడవకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు.