How to Stop Water Leakage From Fridge : ఫ్రిడ్జ్ కొనుగోలు చేసిన కొత్తలో బాగానే ఉంటుంది. కొన్నాళ్ల తర్వాతే సమస్యలు మొదలవుతాయి. ఇందులో ఒకటి.. ఫ్రిడ్జ్ నుంచి నీరు లీక్ కావడం. ఇది సాధారణ సమస్యే అయినప్పటికీ.. దాని వల్ల కలిగే చిరాకు అంతా ఇంతా కాదు. రిఫ్రిజిరేటర్ నుంచి నీరు లీకేజీ అవ్వడం వల్ల ఇల్లంతా తడితడిగా అయిపోవడం.. ఫ్లోరింగ్ పాడవడం వంటి సమస్యలు వస్తుంటాయి. అంతేకాదు.. నడుస్తున్నప్పుడు ఒక్కోసారి ఆ వాటర్ లీకేజీ వల్ల జారిపడే అవకాశాలూ లేకపోలేదు. మరి ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలుసా? మేము చెప్పబోయే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు.. మెకానిక్ సహాయం లేకుండానే ఫ్రిడ్జ్(Refrigerator) నుంచి వాటర్ లీకేజీని ఆపేయొచ్చు.
ఇలా చేయండి..
- ముందుగా మీరు రిఫ్రిజిరేటర్ ప్లగ్‌ను.. స్విచ్‌బోర్డు నుంచి తీసేయండి.
- ఫ్రిజ్‌లో ఉన్న వస్తువులన్నింటినీ బయటకు తీయండి.
- ఫ్రిడ్జ్ పూర్తిగా ఖాళీ అయ్యాక అసలు వాటర్ లీకేజీకి కారణం ఏంటో చూడండి.
- వాటర్ లీకేజీని కనుగొనడానికి ముందుగా.. డీప్ ఫ్రిజ్‌కు కనెక్ట్ అయి ఉండే పైప్‌ను చెక్ చేయండి.
- ఎక్కడైనా ఆ పైప్ పగిలిపోయినట్టైతే దానిని సరి చేసుకోవాలి.
- అదేవిధంగా మీ రిఫ్రిజిరేటర్ అన్ని వైపులా సమాంతరంగా ఉందా? లేదా? చెక్ చేసుకోవాలి.
- ఒకవైపు వంగినా కూడా.. వాటర్ లీకేజీకి కారణం అవుతుంది.
How to Stop Bad Smell From Fridge : ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుందా?.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!