తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మీ పిల్లలకు తరచూ ఎక్కిళ్లు వస్తున్నాయా? - పిల్లల్లో ఎక్కిళ్లు అదుపు చేసే పద్ధతులు

కొంత మంది పిల్లలకు తరుచూ ఎక్కిళ్లు(Baby Hiccups) వస్తుంటాయి. మరికొంత మంది శిశువులకు ఎంతసేపు ఫీడింగ్(Breastfeeding)​ చేసినా.. పాలు సరిపోలేదన్నట్లుగా ఏడుస్తుంటారు. ఈ సమస్యలకు ప్రముఖ వైద్య నిపుణులు చెప్పే పరిష్కారాలేంటో తెలుసుకుందాం.

baby hiccups
పిల్లలు, ఎక్కిళ్లు

By

Published : Sep 15, 2021, 10:04 AM IST

కొంత మంది పిల్లలకు పాలు తాగిన తర్వాత ఎక్కిళ్లు(Hiccups in Baby) బాగా వస్తుంటాయి. ఎక్కువ మోతాదులో పాలు తీసుకున్నప్పటికీ ఈ సమస్య ఉంటుంది. మరికొంత మంది పిల్లలు అరగంటపాటు చనుబాలు(Breastfeeding) తాగినప్పటికీ.. ఇంకా సరిపోలేదన్నట్లు ఏడుస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కంగారు పడిపోతుంటారు. పిల్లలకు పోత పాలు పడుతుంటారు. అయితే.. బ్రెస్ట్ ఫీడింగ్​తో పాటు ఇలా చేయవచ్చా?. ఎక్కిళ్లు(Baby Hiccups Solution) తగ్గించడానికి ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం..

కాస్త సమయం ఇవ్వాలి..

సహజంగా పాలు తాగేటప్పుడు పిల్లలు.. పాలతో పాటు కొంత గాలిని కూడా మింగుతారు. అనంతరం గాలి ఏదో రకంగా బయటికి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తేన్పు తీసుకునే సమయం వారికి ఇవ్వాలి. ఇలా చేస్తే ఎక్కిళ్ల సమస్యను అదుపు చేయవచ్చు.

పాలు సరిపోవాలంటే..

3-4 నెలల పిల్లలు పాలు ఎక్కువగా తాగుతుంటారు. చనుబాలు తాగేటప్పుడు సహజంగా 15 నుంచి 20 నిమిషాలు తీసుకుంటారు. నాలుగు లేదా ఐదు గంటల వ్యవధిలో పాలు తాగుతుంటారు. ఒకవేళ వాళ్లు బరువు పెరగడం మెరుగ్గా ఉంటే పాలు సరిగ్గా తీసుకుంటున్నారని అర్థం.

అరగంట ఫీడింగ్​ తర్వాత కూడా పిల్లలు ఏడుస్తుండటం, బరువు పెరగకపోవడం వంటివి పాలు సరిపోవడంలేదనే సమస్యకు సంకేతాలు. ఈ క్రమంలో పిల్లలకు ఎక్కువ పాలు ఇవ్వడమనేది కొంత వరకు సరైనదే. కానీ, ఫీడింగ్​ సరైన పద్ధతిలో ఇస్తే.. పాలు సరిపోకపోవడం అనేది ఉండదు. ఇలాంటి సమస్యలుంటే డాక్టర్​ను సంప్రదించడం మేలు.

ఇదీ చదవండి:బరువు పెరగడం లేదా? కారణాలు ఇవే కావొచ్చు..!

ABOUT THE AUTHOR

...view details