How to Remove Pesticides from Fruits in Telugu : ఈ కాలంలో ఎవరి ఆరోగ్యానికి వారే రక్ష. ఎవరో వచ్చి, ఏదో చేస్తారంటే అది భ్రమే! కాబట్టి.. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సంరక్షణలో అన్నింటికన్నా ముఖ్యమైంది మన జీవనశైలి. మంచి ఆహారం, బరువు అదుపు, వ్యాయామం(Exercise)లాంటివి మన హెల్త్‌ను ఫిట్ గా ఉంచుతాయి. వాటిలో ప్రధానంగా మనం మంచి ఆహారం గురించి చెప్పుకోవాలి. అయితే ఆరోగ్యకరమైన ఆహారంలో తాజా పండ్లు(Fruits), కూరగాయలు ప్రధాన భూమిక పోషిస్తాయనడంలో సందేహం లేదు.
How to Remove Pesticides from Vegetables :కానీ..వ్యవసాయంలో వినూత్న మార్పులు వచ్చేశాయి. కృత్రిమ రసాయనాల వాడకం అధికమైంది. ఏ పంట చూసినా ఎరువులతోనే పెరిగే పరిస్థితి నెలకొంది. దీంతో.. పండ్లు, కూరగాయలలో విపరీతమైన రనాయనాలు ఉంటున్నాయి. ఆర్గానిక్ పండ్లు, కూరగాయలు కొనాలంటే.. అధిక ఖర్చు. దీంతో.. చాలామంది.. మార్కెట్లో దొరికే పండ్లు, కూరగాయలే తినేస్తున్నారు. అయితే.. వాటిపై ఉండే రసాయన అవశేషాలు అలాగే ఉండిపోతున్నాయి.
Avoid These Habits After Meal : తిన్న వెంటనే ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త పడాల్సిందే..!
ఇలాంటివి తినడం వల్ల.. ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, హార్మోన్ల సమస్యలు, చర్మ, జుట్టు రాలే సమస్యల బారిన పడుతుంటారు. ఇంకా అవి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే.. మెదడు, కిడ్నీ, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం మెండుగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే.. ఈ సమస్యకు ఇక్కడ ఓ పరిష్కారం చూపిస్తున్నాం. ఈ పద్ధతి ద్వారా బయట దొరికే పండ్లు, కూరగాయల(Vegetables)ను ఎలాంటి రసాయనాలు, క్రిమికీటకాలు లేకుండా పరిశుభ్రంగా మార్చుకుని తినొచ్చు.