తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? - ఈ టిప్​తో మీ జుట్టు నిగనిగలాడిపోద్ది! - చలికాలంలో చుండ్రు సమస్య ఇలా చెక్

Dandruff Remove Tips in Winter : ప్రతి ఒక్కరికీ సాధారణంగా ఎప్పుడో ఒకప్పుడు చుండ్రు వస్తుంది. చలికాలంలో ఈ సమస్య అధికమవుతుంది. దాంతో చాలా మంది నివారణ కోసం చర్మవ్యాధి వైద్యులను ఆశ్రయిస్తుంటారు. కొన్ని టిప్స్ కూడా పాటిస్తుంటారు. కానీ, ఆ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందలేకపోతుంటారు. అలాంటి వారి కోసం అద్భుతమైన చిట్కాను పట్టుకొచ్చాం. దీనిని ఓసారి ట్రై చేశారంటే.. మరోసారి చుండ్రు సమస్య రాదు.

Winter Hair Care Tips
Winter Hair Care Tips

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 4:08 PM IST

Dandruff Remove Tips in Winter :సీజన్​ మారుతున్న కొద్దీ.. ముఖ సౌందర్యపరంగా, జుట్టు ఆరోగ్య పరంగా పలు సమస్యలు తలెత్తుతుంటాయి. మరీ ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే.. ఎక్కువ మందిని వేధించే జుట్టు సమస్యల్లో చుండ్రు ప్రధానమైనది. మరికొందరి పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. వీళ్లు సీజన్​తో సంబంధం లేకుండా ఈ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం మేము అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాం. దీన్ని స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ చిట్కాను కనుక మీరు ఓసారి ట్రై చేశారంటే.. చండ్రు సమస్య(Dandruff Problems)నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇంతకీ ఆ చిట్కా ఏంటి? దానిని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆ చిట్కా ఏంటంటే..?

  • కొబ్బరి నూనె, నిమ్మరసం (Coconut Oil and Lemon) కలిపి జుట్టుకు అప్లై చేయాలి.
  • ఒక గిన్నెలో 2 కప్పుల గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 స్పూన్ల నిమ్మరసం, 4 స్పూన్ల కొబ్బరి నూనె వేసి కలుపుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
  • ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజు రాత్రి పడుకునేముందు తలకు బాగా పట్టించాలి.
  • అనంతరం తలకు వస్త్రాన్ని చుట్టుకుని పడుకోవాలి.
  • రాత్రంతా అలాగే ఉంచి.. ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
  • ఇలా చేయడం ద్వారా చుండ్రు సమస్య ఈజీగా తగ్గుతుంది. వారానికి ఒకసారి ఈ చిట్కాను ట్రై చేయండి. దీని ద్వారా మంచి రిజల్ట్ పొందుతారు.

మీ జుట్టు రాలిపోతుందా..? అయితే ఇలా చేస్తే సరిపోతుంది..!

జుట్టుపై ప్రభావం చూపే మరికొన్ని సమస్యలు..

ఎవరైనా ఎక్కువ కాలం ఒత్తిడి అనుభవిస్తే.. అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇది శరీరం మీదనే కాకుండా.. మీ జుట్టు(Hair)పైనా ప్రభావం చూపుతుంది. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల.. ఒత్తిడి లేకుండా ఉండడానికి ప్రయత్నించండి. అందుకోసం.. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. అలాగే కంటినిండా నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే హెయిర్ ప్రొడక్ట్స్(Hair Products)వాడడం వల్ల కూడా జుట్టు సమస్యలు(Hair Problems) ఎక్కువ అవుతాయి. జుట్టు ఉత్పత్తుల్లో ఉండే సల్ఫేట్‌లు హెయిర్​కు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ.. వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. అలాగే అవి జుట్టును తెల్లగా మారుస్తాయి. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే.. చాలా మంది ఇలాంటి టిప్స్ కొంత కాలం పాటించి వదిలేస్తుంటారు. కానీ అలా వదిలేయకూడదని.. కంటిన్యూ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా.. ఎలాంటి ఖర్చు లేకుండానే ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.

How To Look Young Forever : ఆరు పదుల వయసులోనూ యవ్వనంగా కనిపించాలా?.. ఈ 10 టిప్స్​ పాటిస్తే చాలు!

Hair Growth Tips : జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరగాలా? ఈ పనులు అస్సలు చేయకండి

ABOUT THE AUTHOR

...view details