చాలామంది బరువు(over eating disorder) పెరిగిపోతున్నామని.. వెంటనే తగ్గిపోవాలని భావించి తినే ఆహారాన్ని నియంత్రించుకుంటారు. అలా కొద్దిరోజులు ఉండగలుగుతారు కూడా. అంతలోనే బాగా ఇష్టమైన ఫుడ్ కళ్లకు కనిపిస్తుంది. ఇంకేముంది జిహ్వ చాపల్యం చంపుకోలేక మళ్లీ లాగించడం మొదలు పెట్టేస్తారు. వాస్తవానికి ఆహారం అనేది మితంగా తింటేనే ఆరోగ్యం, పరిమితి దాటి తింటే అనారోగ్యం(how to stop over eating disorder).
అయితే మనం ఎంత వద్దు అనుకున్నప్పటికీ తినేసే పరిస్థితి కొన్నిసార్లు ఏర్పడుతుంది. దీనితో ఆహారం అతిగా తినేస్తాం. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. చివరకు మనకు తెలియకుండానే ఊబకాయానికి దారితీస్తుంది.
కొన్ని సందర్భాల్లో ఏదైనా తిన్న వెంటనే మరోసారి తినాలనిపిస్తుంది(cravings after meals). స్వీట్లు, చిప్స్ వంటి 'చిరుతిండ్లు' నోట్లో వేసుకోవాలని కూడా అనిపిస్తుంటుంది. ఈ పరిస్థితిని 'క్రేవింగ్స్'(cravings meaning) అంటారని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా తీసుకునే ఆహారంతో ఎటువంటి నష్టం లేనప్పటికీ.. 'క్రేవింగ్స్' అనే భావనకు లొంగిపోతే ఆరోగ్యానికి సమస్య మొదలవుతుందని వివరిస్తున్నారు. దీనిని నియంత్రించడమే ప్రస్తుత తరం ముందున్న అతిపెద్ద సవాల్ అని పేర్కొంటున్నారు.