తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

యూరిక్ యాసిడ్ పెరిగితే కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు.. ఇవి తింటే అంతా సెట్​! - gout disease treatment

High Uric Acid Causes : ఇటీవల కాలంలో చాలా మందికి యూరిక్ యాసిడ్ సమస్య వస్తోంది. అయితే ఈ సమస్యను కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో కిడ్నీలో రాళ్లు, గౌట్​, మోకాళ్ల నొప్పులు, కడుపులో మంట వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి యూరిక్ యాసిడ్ స్థాయిలను ఎలా తగ్గించుకోవచ్చో ఓ సారి తెలుసుకుందాం.

high uric acid causes
high uric acid causes

By

Published : Jun 9, 2023, 4:19 PM IST

Updated : Jun 9, 2023, 4:30 PM IST

High Uric Acid Causes : ఒక్కోసారి కొంత మందిలో చేతి, కాలి వేళ్లు ఉన్నట్లుండి ఎర్రగా వాచిపోతుంటాయి. నొప్పి కూడా బాగా వస్తుంటుంది. ఆ సమయంలో చేతులు, కాళ్లను కదపాలన్నా ఎంతో కష్టంగా ఉంటుంది. దీనిని 'గౌట్' అంటారు. రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు పెరగడమే ఇందుకు కారణం. ఇదే కాదు.. యూరిక్‌ యాసిడ్‌ మోతాదు మించితే కడుపులో మంట, కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, మూత్రపిండాల సమస్యలు కూడా తలెత్తుతాయి. అలాగే మైపర్యూపిసెమియాకు దారి తీయవచ్చు.

యూరిక్‌ యాసిడ్‌.. మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో ఒకటి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని 'ప్యూరిన్‌' అనే రసాయనం విచ్ఛిన్నం చెందినప్పుడు యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా విసర్జితమవుతుంటుంది. అయితే విసర్జన సరిగా జరగకపోయినప్పుడు యూరిక్‌ యాసిడ్‌ రక్తంలోనే నిలిచిపోతుంది. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి. దీంతో కిడ్నీల్లో రాళ్లు, గౌట్​ వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అయితే ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలెంటో ఓ సారి చూద్దాం.

ఇంట్లో ఉండే కొన్ని పండ్లు, పానీయాలు తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ మోతాదును తగ్గించుకోవచ్చు. అరటి పండ్లు, కాఫీ, గ్రీన్ టీ వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

అరటి పండుతో లాభాలు..
అరటి పండ్లలో ఆల్కలీన్ ఉంటుంది. అందువల్ల అరటి పండ్లలో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది. అలాగే అరటి పండ్లలో పొటాషియం, విటమిన్ సి వంటి పోషక విలువలు ఉంటాయి. దీంతో అరటిని తింటే గౌట్ సమస్య నుంచి బయటపడొచ్చు.

చెర్రీస్‌తో చెక్
చెర్రీస్‌లో రోగ నిరోధక శక్తి పెంచే విటమిన్​ ఉంటుంది. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో బాగా సహాయపడతాయని చాలా అధ్యయనాల్లో తేలింది. చెర్రీస్‌లో ఆంథోసైనిక్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని నిరోధిస్తాయి.

తక్కువ కొవ్వుతో కూడిన పాల పదార్థాలు
తక్కువ కొవ్వు కలిగిన పాల పదార్థాలు.. గౌట్ సమస్య నుంచి రక్షణ కల్పిస్తాయి. పాల ఉత్పత్తులో ఉండే విటమిన్ డి, ప్రొటీన్లు.. శరీరంలో ఉండే యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.

ఆకుకూరలతో లాభాలు..
బచ్చలి కూర, కాలే, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయల్లో ప్యూరిన్​ తక్కువగా ఉంటుంది. వీటిని మీరు తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల లాభం ఉంటుంది. వీటిల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించే పోషక విలువలు ఉన్నాయి.

తృణధాన్యాల వల్ల ప్రయోజనం
బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి తృణధానాల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. శరీరం నుంచి యూరిక్ యాసిడ్​ను బయటకు పంపించడంలోనూ ఓట్స్ సహాయపడతాయి.

కాఫీ, గ్రీన్ టీ..
కాఫీ.. యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుందట. అలాగే గౌట్​ సమస్యకు చెక్ పెడుతుందట. ఇక గ్రీన్ టీలో రోగ నిరోధక కారకాలు చాలా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అలానే గ్రీన్​ టీ తాగడం వల్ల యూరిక్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

Last Updated : Jun 9, 2023, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details