తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

సడెన్​గా గుండె ఎందుకు ఆగిపోతుంది? హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

How To Prevent Heart Attack : కొంతమంది వ్యాయామం చేస్తూ, ఏదైనా ఆట ఆడుతున్నప్పుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోతుంటారు. గుండె పనిచేయడం ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారు. ఇలా ఉన్నట్టుండి ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామా మరి.

How To Prevent Heart Attack
How To Prevent Heart Attack

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 11:07 AM IST

How To Prevent Heart Attack :కన్నడ స్టార్ హీరో పునీత్​ రాజ్​కుమార్ జిమ్​లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, తర్వాత క్షణాల వ్యవధిలో తుదిశ్వాస విడిచిన వార్తలు మనం చూశాం. ఇలా చాలామంది హఠాత్తుగా వచ్చే గుండెపోటు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీనినే వైద్యపరంగా 'సడన్ కార్డియాక్ డెత్' అని అంటారు. ఇది ఎందుకు వస్తుంది? వస్తే ఏం చేయాలి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందాం.

గుండె ఇలా పని చేస్తుంది
మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందని మనకు తెలుసు. అయితే గుండె ఇలా కొట్టుకోవడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి విద్యుత్ సంకేతాలు అవసరం. గుండెలో బియ్యపు గింజ పరిమాణంలో ఉండే సైనస్​నోడ్ అనే ప్రాంతం నుండి మిగిలిన భాగానికి విద్యుత్ సంకేతాలు అందుతాయి. ఇలా విద్యుత్ సంకేతాలు అందడంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే గుండె హఠాత్తుగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు.

గుండె ఎందుకు ఆగిపోవచ్చు
Sudden Cardiac Arrest :గుండె ఆగిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెలోని కవాటాలు మూసుకుపోవడం, రక్తం ప్రసరించే మార్గంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం లాంటివి ఇందుకు కారణం కావచ్చు. కవాటాలు చిన్నగా అవ్వడం వల్ల గుండె పూర్తి స్థాయిలో రక్తాన్ని పంప్ చేయలేదు. అలాగే రక్తం సరఫరాలో అడ్డుగా వచ్చే కొలెస్ట్రాల్ వల్ల కూడా ఇలాంటి సమస్య ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు లేదంటే ఎక్కువ శ్రమించడం వల్ల సైనస్ నోడ్ నుండి వేగంగా విద్యుత్ సంకేతాలు అందడం వల్ల గుండె వేగం పెరగవచ్చు. ఇది మరింత ఎక్కువై గుండె పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు.

"గుండె కవాటాలు మూసుకుపోయినా, రక్తం సరఫరాలో ఏదైనా అంతరాయం ఏర్పడినా, గుండెకు అందే విద్యుత్ సంకేతాల్లో ఎలాంటి అవాంతరం ఏర్పడినా హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. ఫ్యామిలీ హిస్టరీ, అలవాట్లు, శారీరక శ్రమ ఇలా అనేక అంశాలు కూడా హఠాత్తుగా గుండె ఆగిపోవడానికి కారణాలుగా ఉండవచ్చు".

- వి.ఎస్ రామచంద్ర, ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్

గుండె హఠాత్తుగా ఆగిపోతే ఇలా చేయండి
మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్టుండి కుప్పకూలిపోతే వారికి గుండెపోటు వచ్చి ఉండవచ్చు. స్పృహ కోల్పోవడం, శ్వాస ఆగిపోవడం, హృదయ స్పందన నెమ్మదిగా ఆగిపోవడం లాంటి లక్షణాలను మీరు ఆ వ్యక్తిలో గమనిస్తే వెంటనే సీపీఆర్ చేస్తే ప్రయోజనం కలగవచ్చు. అయితే 10 నిమిషాల్లోపు సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని, పది నిమిషాలు దాటితే ఎలాంటి ప్రయోజనం ఉండదని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ అంటే క్రమబద్ధంగా ఛాతి మీద నొక్కుతూ గుండెను బయటి నుంచి స్పందించేలా చేయడమే.

వీటి పట్ల జాగ్రత్త
హఠాత్తుగా గుండె ఆగిపోవడం అనేది ఎవరికైనా సంభవించవచ్చు. అయితే గుండెలో ఏదైనా సమస్య ఉన్నవాళ్లు, కుటుంబంలో ఎవరైనా ఇలా చనిపోయిన వాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. కొంతమందిలో వంశపారంపర్యంగా గుండె సమస్యలు రావచ్చని, ఈసీజీ లాంటి పరీక్షలు చేసుకోవడం ద్వారా స్పష్టత వస్తుందని అంటున్నారు. అలాగే కొంతమందిలో గుండె కండరాలు ఉండాల్సిన పరిమాణం కన్నా ఎక్కువగా ఉండటం వల్ల హఠాత్తుగా ఆగిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. పొగ, మద్యం అలవాటు ఉన్న వారికి ఈ ప్రమాదం ఎక్కువేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సడెన్​గా గుండె ఎందుకు ఆగిపోతుంది? హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

మునగ ఆకుతో 300 వ్యాధులకు చెక్ - ఈ బెనిఫిట్స్​ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

తలనొప్పి ఎక్కువ! - ఎందుకో తెలుసా?- రీసెర్చ్​లో విస్తుపోయే నిజాలు!

ABOUT THE AUTHOR

...view details