తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చపాతీలు మృదువుగా రావాలా? - పిండిలో ఇవి కలిపితే చాలు - భలే స్మూత్​గా వస్తాయి! - roti making tips

How to Make Soft Chapati : చపాతీలు మెత్తగా.. మూడు వేళ్లతో తుంచేలా రావాలని అందరూ ఆశిస్తారు. కానీ.. చాలా మందికి చపాతీలు గట్టిగా వస్తుంటాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. చపాతీలు మృదువుగా వస్తాయి. మరి.. ఆ టిప్స్​ ఏంటో తెలుసుకుందాం.

Soft_Chapati_Tips_in_Telugu
Soft_Chapati_Tips_in_Telugu

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 2:13 PM IST

How to Make Soft Chapati : బరువు తగ్గేందుకు.. చపాతీని చాలా మంది బెస్ట్ ఆప్షన్​గా ఎంచుకుంటారు. అయితే.. అందరికీ చపాతీలు మెత్తగా చేయడం రాదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. గట్టిగానే వస్తుంటాయి. టీవీ యాడ్స్​లో చూపించినట్లుగా మెత్తగా, ప్లఫీగా చేయడానికి ప్రయత్నిస్తారు కానీ.. సాధ్యం కాదు. దీంతో విసుగెత్తిపోతారు. అయితే.. కొన్ని చిట్కాలు పాటిస్తే.. చపాతీలు మెత్తగా వస్తాయి. దీనికోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

  • చాలా మంది చపాతీ చేసేందుకు మార్కెట్లో దొరికే ఏదో ఒక పిండి తెచ్చి వాడుతుంటారు. కానీ.. స్వచ్ఛమైన గోధుమ పిండి తెచ్చుకోవాలి.
  • గోధుమలను కొని, పిండి పట్టించుకుని, చపాతీలు చేస్తే సూపర్​ సాఫ్ట్​గా ఉంటాయి. అది సాధ్యం కాకపోతే.. మార్కెట్​లో బ్రాండ్​ చూసి తీసుకోండి.
  • పిండి మెత్తగా ఉండాలి. ఒకవేళ బరసగా ఉంటే.. జల్లెడపట్టాలి.
  • ఆ తర్వాత.. కావాల్సినంత పిండి తీసుకుని అందులో కొంచెం నూనె, గోరువెచ్చని నీరు, కొద్దిగా పాలు పోసి మెత్తగా కలుపుకోవాలి.
  • పిండి గట్టిగా ఉంటే చపాతీ గట్టిగా ఉంటుంది. పిండి మెత్తగా ఉంటే చపాతీ కూడా మెత్తగా ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.
  • పిండిని ఎంతసేపు వీలైతే అంత సేపు మెత్తగా కలుపుకోవాలి.

How to Prepare Palak Prawns Curry : 'పాలక్ ప్రాన్స్ కర్రీ..' నోరూరిపోవాల్సిందే!

  • పిండిని మెత్తగా పిసికిన తర్వాత ముద్దపై కొద్దిగా నూనె రాసి.. ఓ తడి క్లాత్​ను కప్పి సుమారు అర్ధగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
  • ఇలా చేయడం వల్ల చపాతీలు మెత్తగా తయారవుతాయి.
  • తర్వాత పిండి ముద్దను తీసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.
  • చపాతీ పీట మీద రుద్దుకునేటప్పుడు.. చాలా మంది పొడి పిండిని ఉపయోగిస్తారు. ఇలా చేయడం ద్వారా చపాతీ సులభంగా వస్తుందికానీ.. దీనివల్ల రొట్టె గట్టి పడుతుంది.
  • కాబట్టి పొడి పిండిని తక్కువగా వాడాలి. పొడి పిండి ప్లేస్​లో నూనె కూడా ఉపయోగించవచ్చు.
  • అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. పిండిని చపాతీగా తయారు చేసిన తర్వాత.. దాన్ని ఫోల్డ్​ చేసి మరోసారి చపాతీగా రుద్దాలి.
  • ఇలా చేస్తే.. కాల్చేటప్పుడు పొంగుతాయి.
  • చపాతీలు రుద్దిన వెంటనే కాల్చుకోవాలి. లేదంటే అవి ఎండిపోతాయి.
  • ఎండిన తర్వాత కాల్చితే.. గట్టి పడతాయి.

How to Prepare Methi Mutton Curry : మటన్​ ఎప్పుడూ ఒకేలా ఏం తింటారు..? ఈ సండే ఇలా ట్రై చేయండి!

  • చపాతీలను కాల్చేటప్పుడు పెనం వేడిగా ఉండేలా చూసుకోవాలి.
  • అదేవిధంగా.. చపాతీలను తక్కువ మంట మీద కాల్చడం మంచిది.
  • చాలా వేడిగా ఉంటే పిండి ఉడికిపోతుంది. తర్వాత గట్టిపడుతుంది.
  • కొంచెం నెయ్యి రాసి కాల్చితే రుచితో పాటు మెత్తగా ఉంటాయి.
  • చపాతీలను కాల్చిన తర్వాత హాట్​ బాక్స్​లో పెడితే.. ఇంకా ఎక్కువ సేపు మెత్తగా ఉంటాయి.
  • ఈ సారి చపాతీలు చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి.. ఎన్ని తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తుంది.

How to Make Kaddu Ki Kheer Recipe in Telugu: కద్దూ కీ ఖీర్.. టేస్ట్ చేస్తే.. జిందగీ ఖుష్ అనాల్సిందే!

Nellore Chepala Pulusu Recipe in Telugu: నోరూరించే నెల్లూరు చేపల పులుసు.. ఇలా చేశారంటే టేస్ట్​ సూపర్​.. ప్లేటు నాకాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details