Chepala Pulusu Recipe in Telugu : ఫిష్ కర్రీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది..! చేపల పులుసు పేరు చెప్పగానే మౌత్ వాటరింగ్ అయిపోతుందంటే నమ్మాల్సిందే. మీరు కూడా ఈ లిస్టులో ఉంటే.. ఈ సండే లంచ్‌లోకి మెనూ కార్డ్‌లో చేపల పులుసును చేర్చండి. తయారీ గురించి దిగులు చెందకండి. అద్దిరిపోయేలా.. చేపల పులుసు ఎలా తయారు చేయాలో క్లారిటీగా మేం చెప్తాం. కరెక్టుగా చేస్తే.. ప్లేట్లు నాకేస్తారంతే! మరి, ఈ ఫిష్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్.. ఇంకా కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం..
Fish curry: లేత బెండకాయలతో చేపల పులుసు
తయారీకి కావాల్సిన పదార్థాలు:
- చేపలు - కేజీ
- నిమ్మరసం - అర చెక్క
- కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్
- గరం మసాలా - 1 టీస్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీస్పూన్లు
- నూనె 2 టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి 4 (నిలువుగా కోసినవి)
- జీలకర్ర - 1 స్పూన్
- చిన్న ఉల్లిపాయ (పెద్ద ముక్కలుగా కోసి ఉంచినవి)
- చింతపండు పులుసు 40 గ్రాములు
- ధనియాల పొడి 1 టీస్పూన్
- వేయించిన జీలకర్ర పౌడర్ పావు టీస్పూన్
- మెంతుల పొడి - పావు టీ స్పూన్
- పసుపు చిటికెడు
- ఉప్పు సరిపడా
How to Prepare Chepala Pulusu Recipe in Telugu :
ముందుగా మసాలా పట్టించాలి..
- చేప ముక్కలు క్లీన్ చేసిన తర్వాత.. కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపి.. 10 నిమిషాలు పక్కన పెట్టాలి.
- ఆ తర్వాత 2సార్లు నీటితో కడగాలి. ఉప్పు, నిమ్మరసం వేసి కడిగితే నీచు వాసన రాదు.
- ఇప్పుడు చేప ముక్కలపై కారం వేయాలి. ఘాటు ఎక్కువ తినేవాళ్లు పైన చెప్పిన దానికన్నా ఇంకాస్త వేసుకోవచ్చు.
- తర్వాత పసుపు చిటికెడు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యాలి.
- అనంతరం కూరకు సరిపడా ఉప్పు వెయ్యాలి.
- ఇవన్నీ చేప ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. అన్ని ముక్కలకూ కారం, మసాలాలు అంటుకోవాలి.
- ఓ 5 నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత.. 15 నిమిషాల నుంచి అరగంట పాటు పక్కన ఉంచాలి.
తయారీ విధానం :
- స్టవ్ మీద కూర గిన్నె పెట్టండి. కొంచెం పెద్దదే అయితే మంచిది. ఇందులో ఆయిల్ వేయండి.
- నూనె వేడి అయ్యాక.. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి.. బాగా వేయించండి.
- ఇప్పుడు మసాలాలు కలిపి ఉంచిన చేప ముక్కల్ని గిన్నెలోకి వెయ్యండి.
- స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో ఉండేలా చూసుకోండి. ముక్కలు సరిగ్గా కుదురుకునేలా చేసి మూత పెట్టండి.
- 3 నిమిషాల తర్వాత మూత తియ్యండి.
- ముక్కల్ని తిరగేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గిన్నెను స్టవ్ మీద నుంచి దించి ఎగవేత ద్వారా ముక్కల్ని తిరగేస్తే బెటర్. లేదంటే.. ముక్కలు విడిపోతాయి.
- ఇప్పుడు మళ్లీ మూత పెట్టి 3 నిమిషాలు ఉంచండి.
- ఆ తర్వాత మూత తీసి చింతపండు పులుసు వెయ్యాలి.
- చింత పులుసు పోసిన తర్వాత.. ముక్కల్ని అడుగు భాగానికి చేరేలా.. వాటిని కొద్దిగా కదపండి.
- అన్ని ముక్కలూ పులుసులో మునిగేలా చేసిన తర్వాత మూత పెట్టండి.
- 6 లేదా 8 నిమిషాల తర్వాత ఓపెన్ చెయ్యండి.
- ఇప్పుడు ఓ ముక్కను తీసి... ఫోర్క్ తో గుచ్చండి. ఫోర్క్ ఈజీగా దిగితే.. ముక్కలన్నీ ఉడికినట్లే. లేకపోతే మరికొన్ని నిమిషాలు ఉడికించుకోండి.
- ఆ తర్వాత... ధనియాల పొడి వేయాలి. ఇది అస్సలు మిస్ చెయ్యవద్దు. తప్పకుండా వేయాలి.
- కాసేపటి తర్వాత.. జీర పౌడర్, మెంతుల పొడి వేయాలి.
- ఈ మెంతులు చాలా కీలకం. ఈ పొడి వేస్తేనే.. మీకు అద్భుతమైన టేస్ట్ వస్తుంది.
- చివరగా కొత్తిమీర కావాలనుకుంటే.. వేయండి.
- అంతే.. ఘుమఘుమలాడే చేపల పులుసు రెడీ.
Telangana Special Natukodi Curry : తెలంగాణ స్టైల్లో నాటుకోడి కర్రీ.. మసాలా నషాళాన్ని తాకాల్సిందే!
నెల్లూరు చేపల పులుసు.. తిన్నారంటే అదుర్స్!
'పల్లెటూరి చేపల పులుసు' రుచి అదుర్సు!