How To Loss Weight In Winter : మనలో చాలా మంది బరువు తగ్గాలని కొన్ని నెలల నుంచి కష్టపడుతుంటారు. ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ వంటివి చేయడానికి పార్కులకు, మైదానాలకు వెళ్తుంటారు. కానీ, చలికాలం వచ్చే సరికి కొంతమంది వ్యాయమాలకు, వాకింగ్‌లకు బ్రేక్ వేస్తారు. ఉదయాన్నే వీచే చలిగాలులకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే దుప్పటి ముసుగేసి హాయిగా నిద్రపోతారు. ఇలాంటి వారిని మనం చాలా మందిని చూసి ఉంటాం. అయితే చలికాలంలో బరువు తగ్గాలి అని అనుకునేవారు ఇంట్లోనే ఉండి కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం వారు ఐదు మార్గాలను సూచించారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
5 Tips to Loss Weight in Winter:
నీళ్లను తాగడం :చాలా మంది చలికాలంలో నీటిని తక్కువగా తాగుతారు. ఇలాంటి వారు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తాగాలి. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో వ్యాయమాలు, వాకింగ్, జాగింగ్ వంటివి చేయని వారు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గోరు వెచ్చని నీరు తాగడం వల్ల కడుపు నిండినట్లు అనిపించి, ఆకలి తగ్గుతుంది. దీనివల్ల తక్కువగా తింటారు. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వెచ్చదనం కోరుకునే వారు గ్రీన్ టీ, హెర్బల్ టీలను కూడా తీసుకోవచ్చు.
మీకు బ్లూ టీ గురించి తెలుసా? బరువు తగ్గి నాజూగ్గా మారిపోతారు!
స్నాక్స్‌గా తృణధాన్యాలు:చాలా మంది చలికాలంలో వేడివేడిగా బయట దొరికే చిరుతిళ్లను తినడానికి ఆసక్తి చూపిస్తారు. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, సాయంత్రం స్నాక్‌గా తృణధాన్యాలను తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. తృణధాన్యాలలో తక్కువ కేలరీ, ఎక్కువ ఫైబర్‌లు ఉంటాయి. దీనివల్ల కడుపుని నిండి, ఆకలి తగ్గుతుంది. మీకు ఇష్టమైతే డ్రైఫ్రూట్స్ కూడా తినవచ్చు.