అందం గురించి ఆలోచించని, దాని కోసం ప్రయత్నించని వ్యక్తి ఎవరూ ఉండరు! వీటికోసం రకరకాలైన పద్ధతులను (BEAUTY TIPS) అనుసరిస్తుంటారు. కొందరు రోజుకు పదిసార్లు కన్నా ఎక్కువగా ముఖం కడిగితే.. మరికొందరు వివిధ రకాల క్రీమ్స్‌ను(skin whitening cream) వాడుతుంటారు. దీని వల్ల రంగులో ఎటువంటి మార్పు రాక పోగా.. సైడ్ ఎఫెక్ట్(skin allergy) వస్తుంటాయి! కాబట్టి రంగులో మార్పు రావాలంటే ఎలాంటి పద్ధతులు అనుసరిస్తే మంచిదో తెలుసుకుందాం.
BEAUTY TIPS: శరీర రంగు తెల్లగా మారాలంటే ఏం చేయాలి? - స్కిన్ ఫేస్‌ప్యాక్
మనలో చాలా మందికి తెల్లగా మారాలనే కోరిక ఉంటుంది. అందుకోసం చాలా ప్రయత్నాలే చేస్తాం. ఒకరు క్రీమ్స్ వాడితే.. మరొకరు వంటింటి చిట్కాలను ఫాలో అవుతుంటారు. అయినప్పటికీ ఒక్కోసారి వారిలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ నేపథ్యంలో ఫెయిర్‌గా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
తెల్లగా మారాలంటే ఏం చేయాలి
వాస్తవానికి నల్ల కణాలు చాలా మంచివి. వీటి వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే ఈ రంగును కొంత మేరకు తగ్గించుకోవచ్చు. మన దుస్తులు లోపల ఉన్న శరీరం ఏ రంగులో అయితే ఉంటుందో ఆ రంగుకు చేరవచ్చు. దీని కోసం కొన్ని పద్ధతులు(skin care tips) ఆచరించాల్సి ఉంటుంది.
- ముందుగా సూర్యరశ్మి తాకకుండా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం సన్ స్క్రీన్స్ రాసుకోవాలి. బయట ఎండలోకి వెళ్లినప్పుడు గొడుగు, మాస్క్ వంటివి ధరించాలి.
- బీచ్‌ల దగ్గరకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి.
- హిల్ స్టేషన్స్‌కు వెళ్లినప్పుడు కూడా ప్రాథమికంగా కొన్ని నియమాలు పాటించాలి.
- ఇంట్లోనే ఉండే కొన్ని ప్యాక్స్ ఉపయోగించుకోవచ్చు. సిట్రిక్ యాసిడ్ ఉండే నిమ్మరసం, లాక్టిక్ యాసిడ్ ఉండే పెరుగు లాంటి వాటిని ప్యాక్స్‌లో ఉండేలా చూసుకోవాలి. వీటి ద్వారా నల్ల రంగు తగ్గుతుంది.
- డాక్టర్ సలహా మేరకు కొన్ని క్రీమ్‌లను ఉపయోగించవచ్చు.
- కార్టికో స్టెరాయిడ్ క్రీమ్‌లను(skin care products) ప్రస్తుతం చాలామంది ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల మొదట బాగా రంగు కనిపించినా.. ఆ తరువాత సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటాయి. కావున కార్టికో స్టెరాయిడ్ లేకుండా ఉండే క్రీమ్‌లనే వాడాలి.
- ప్రస్తుతం మీరు వాడుతున్న ఫెయిర్‌నెస్(skin whitening cream) క్రీమ్‌లు శరీరానికి పడుతున్నాయా? లేదా? అనేది పక్కాగా చూసుకోవాలి.
ఇదీ చూడండి:healthy diet: దీంతో మన బరువు కంట్రోల్!
Last Updated : Sep 27, 2021, 12:03 PM IST