దాంపత్య జీవితంలో దంపతులు సుఖాలను చవిచూసేది శృంగారంలోనే. అలాంటి సెక్స్లోనే తృప్తి లేకపోతే వారి దాంపత్య జీవితం అంధకారం అవుతుంది. ముఖ్యంగా మగవాళ్లలో కొంతమందికి అంగం చిన్నదిగా ఉండటం వల్ల వారు భార్యల ముందు అవమానంగా, సిగ్గుగా ఫీలవుతారు. అంగాన్ని పెద్దదిగా చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటివారు శృంగారంలో పాల్గొనకుండా తప్పించుకుంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? నిజంగా అంగం చిన్నగా ఉంటే భార్యను సుఖపెట్టలేరా? నిపుణుల సమాధానం ఏంటో తెలుసుకోండి.
ప్రశ్న: అంగం చిన్నదిగా ఉంటే రతిలో స్త్రీకి తృప్తి ఉండదా?
సమాధానం:అలా ఏమీ ఉండదు. అంగం చిన్నగా ఉన్నా, పెద్దగా రతిలో స్త్రీకి ఒకే రకమైన తృప్తి కలుగుతుంది. అంగం పెద్దగా ఉంటే స్త్రీకి ఎక్కువగా తృప్తి కలుగుతుందని చాలా మంది మగవారు పొరబడుతుంటారు. వాస్తవానికి స్త్రీకి సుఖాన్ని కలిగించే కామనాడులు రెండు, రెండున్నర అంగుళాలు మాత్రమే ఉంటాయి. అక్కడి వరకే అనుభూతి కలుగుతుంది. తర్వాత ఎలాంటి కామనాడులు ఉండవు. కాబట్టి పురుషాంగం ఎంత పొడవున్నా లోపల ఏమీ తెలియదు. పురుషాంగం నాలుగు అంగుళాలు ఉండి, సరిగ్గా చేయగలిగితే స్త్రీకి చెప్పలేనంత తృప్తి కలుగుతుంది.
ఒకవేళ.. 'నీ అంగం చిన్నదిగా ఉంది, నాకు తృప్తి కలగడం లేదు' అని ఎవరైనా స్త్రీ అంటే వారి మధ్య మానసిక అనుబంధం, ఆప్యాయత, అనురాగం లేదని అర్థం. అందుకు మానసిక పరమైన కారణాలే కానీ అంగం పరిమాణం ఏమాత్రం కాదు.
ప్రశ్న: పురుషాంగ పరిమాణం పెరుగుతుందా?