How To Increase Sexual Feelings : వివాహమైన ప్రారంభంలో శృంగారంపై ఉన్న ఆసక్తి తర్వాత కాలంలో ఉండదు. కాలం గడిచే కొద్దీ క్రమంగా లైంగిక పరమైన కోరికలు తగ్గి.. సెక్స్ లైఫ్ డల్ అవుతుంది. దీంతో దంపతుల మధ్య గొడవలు కూడా జరిగే అవకాశముంది. అందుకే సెక్స్ లైఫ్ డల్ కావడానికి గల కారణాలు ఏమిటి? మళ్లీ శృంగారంపై ఆసక్తి, ప్రేరణ ఏ విధంగా పొందాలి ? అనే విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Reasons For Sex Drive Loss : సెక్స్ లైఫ్ డల్ కావడానికి గల ప్రధాన కారణం.. విసుగు రావడం. మన వృత్తి రీత్యా, బాధ్యతల రీత్యా మనకు తెలియకుండానే మనపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల చిరాకు, విసుగు, ఒకరకమైన డిప్రెషన్ కలుగుతాయి. ఇవి నేరుగా శృంగార జీవితంపై ప్రభావం చూపుతాయి. దీనితో శృంగారంపై ఆసక్తి బాగా తగ్గిపోతుంది. అందుకే ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. మీ వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగ బాధ్యతల నుంచి చిన్న బ్రేక్ తీసుకోవాలి. అంటే.. మీ బిజీ బిజీ లైఫ్ నుంచి కాస్త విరామం తీసుకుని.. భార్యాభర్తలు ఇద్దరూ విహారయాత్రకు వెళ్లాలి. అందమైన ప్రదేశాలను సందర్శించాలి. ఇద్దరూ మనస్సు విప్పి మాట్లాడుకోవాలి. ఒకరినిఒకరు అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రేమ, అభిమానం, అప్యాయత పెరుగుతాయి. ఫలితంగా శృంగారంపై కూడా ఆసక్తి పెరుగుతుంది.
How To Increase Sexual Desire :వాస్తవానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. దీని వల్ల శృంగారంపై కూడా ఆసక్తి పెరుగుతుంది. ఒక వేళ మీకు అంత సమయం లేకపోతే.. రోజూ పనులు పూర్తయ్యాక సరదాగా వాకింగ్ అయినా చేయాలి. కచ్చితంగా వీలు దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహార యాత్రకు వెళ్లాలి. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. మీ రొటీన్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా మీ డల్‌నెస్ పోయి.. శృంగార ఆసక్తి పెరుగుతుంది.
యాంత్రికంగా వద్దు :చాలా మంది 'ఏదో చేయాలి కనుక.. తప్పదు కనుక' అనే ఆలోచనలో యాంత్రికంగా సెక్స్‌లో పాల్గొంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. మీ జీవిత భాగస్వామితో మనఃస్ఫూర్తిగా శృంగారంలో పాల్గొనాలి. అప్పుడే సెక్స్ అనంతరం ఫీల్‌గుడ్ హార్మోన్లు విడుదలై మీకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.