తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మీ పిల్లలు బరువు తగ్గుతున్నారా? కారణం ఇదేనట! - What is the correct weight in Children

How To Increase Baby Weight : మీ చిన్నారి బరువు తగ్గుతున్నారా? పుట్టినప్పటి కన్నా.. ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యారా? కారణం ఏంటో తెలియట్లేదా? అయితే.. మీకోసమే ఈ స్టోరీ. నిపుణులు ఏం చెబుతున్నారో వినండి.

How To Increase Baby Weight
How To Increase Baby Weight

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 3:37 PM IST

How To Increase Baby Weight : శిశువుల బరువు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. పుట్టినప్పుడు సరైన బరువుతో జన్మించినా కూడా.. ఆ తరువాత బరువు తగ్గిపోతున్నారని వైద్యులను సంప్రదిస్తుంటారు. ముఖ్యంగా ఆరు నెలలలోపు చిన్నారుల విషయంలో ఈ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. మరి.. వీరికి వైద్యులు ఎలాంటి సలహా ఇస్తున్నారు? ఆరోగ్యకరమైన బరువును కొనసాగించాలంటే ఏం చేయాలి? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

బరువులో తగ్గుదల..
సాధారణంగా తల్లిపాలు తాగే పిల్లలు కొన్ని రోజుల తరువాత.. పుట్టినప్పుటి బరువులో 6 నుంచి 7 శాతం వరకు తగ్గుతారట. అలాగే డబ్బా పాలు తాగేవారి శరీర బరువులో 3 నుంచి 4 శాతం తగ్గుదల కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత తల్లి పాల నుంచి తగినంత పోషకాలు అందడంతో క్రమంగా బరువు పెరుగుతారట!

ఆందోళన అవసరం లేదు..
మన దేశంలో జన్మించే నవజాత శిశువులు పుట్టేటప్పుడు 2.5 కిలోల నుంచి 3.5 కిలోల బరువు ఉంటారు. ఇంతకంటే తగ్గితే.. వారిని తక్కువ బరువుతో పుట్టినట్లుగా పరిగణిస్తారు. సాధారణంగా.. నెలలు నిండకుండా పుట్టిన చిన్నారులు తక్కువ బరువుతో జన్మిస్తారు. అయితే.. చిన్నారులు ప్రతిరోజూ 20-30 గ్రాములు బరువు పెరుగుతారట. అంటే.. ఒక నెలలో వారు 600 నుంచి 900 గ్రాములు పెరుగుతారు. కానీ.. కొందరు చిన్నారులు నెలకు 150 నుంచి 200 గ్రాములు బరువు మాత్రమే పెరుగుతారు. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. 6 నెలల తర్వాత పిల్లలు మళ్లీ బరువు తగ్గుతారని.. ఇది సాధారణమేనని తెలియజేస్తున్నారు.

పిల్లలు రాత్రిళ్లు బాగా నిద్రపోతున్నారా? అయితే లావు అవ్వరట!

6 నెలల్లో బరువు రెట్టింపు..
చిన్నారులు పుట్టినప్పటి బరువుతో పోలిస్తే ఐదు నుంచి ఆరు నెలల తరవాత.. రెట్టింపు అవుతారని నిపుణులంటున్నారు. ఒకవేళ మీ పిల్లల బరువు పుట్టినప్పుడు మూడు కిలోలు ఉంటే.. ఐదు నుంచి ఆరు నెలల్లో 6 కిలోలుగా ఉండొచ్చని చెబుతున్నారు. అలా ఒక సంవత్సరంలో బరువు మూడు రెట్లు పెరగవచ్చట.

ఆరోగ్యకరమైన బరువు కోసం..
ఆరు నెలల లోపు శిశువులకు తల్లి పాలను మించిన సంపూర్ణ ఆహారం లేదు. వీరు తల్లిపాలు తాగడం వల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి, బిడ్డకు తల్లి పాలనే పట్టించాలని నిపుణులు చెబుతున్నారు. ఆరు నెలల్లోపు శిశువులకు నీళ్లు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. తల్లి పాలలోనే 85 నుంచి 90 శాతం వరకు నీరు ఉంటుందని చెబుతున్నారు.

పిల్లలు పాలు సరిగ్గా తాగుతున్నారో లేదో తెలుసుకోవడం ఎలా ?
శిశువులు ప్రతి 4 నుంచి 6 గంటలకు మూత్ర విసర్జనకు చేస్తారు. ఆ యూరిన్‌ రంగు నీటిలా ఉంటే వాళ్లు పాలు సరిగ్గా తాగుతున్నారని అర్థం. అలాగే బిడ్డకు తగినంత పోషకాహారం అందుతుందని అర్థం. తల్లి ప్రతీ రెండు నుంచి మూడు గంటలకు శిశువుకు పాలు పట్టించాలి. పిల్లలకు రాత్రిపూట కూడా రెండు మూడు సార్లు పాలు పట్టించాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:పైన తెలిపిన వివరాలు అన్ని నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించాం. శిశువుల ఆరోగ్య విషయంలో ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.

వ్యాయామంతో పిల్లలకు ఎన్ని లాభాలో తెలుసా?

మీకు పుట్టబోయే బిడ్డ రూపాన్ని - ఈ 6 అంశాలు నిర్ణయిస్తాయని మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details