ముఖం అందంగా మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది. కానీ, కొంతమందికి జిడ్డు సమస్య చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ఈ సమస్యను తగ్గించుకునేదెలా? దీనికి వైద్య నిపుణులు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తున్నారు?
సాధారణంగా.. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ అని మూడు రకాల చర్మాలు ఉంటాయి. హార్మోన్ ప్రభావం వల్ల కొందరిలో ఆయిల్ ఉత్పత్తిచేసే గ్రంథులు ఎక్కువగా ఉద్దీపన చెందుతాయి. ఫలితంగా ముఖంపై జిడ్డు పేరుకుపోతుంది.
ఈ సమస్యను ఎదుర్కోవడానికి క్రీములను ఉపయోగించవచ్చు. ట్రెటినాయిన్ బేస్ క్రీమ్స్, అసలైన్ బేస్ క్రీమ్స్ వంటివి వాడితే జిడ్డు సమస్య తగ్గిపోతుంది. ఆయిలీ స్కిన్వారి కోసం ప్రత్యేక ఫేస్‌వాష్‌లు, ట్యాబ్లెట్లు ఉంటాయి. వైద్యుల సలహాతో వీటిని వినియోగించి జిడ్డు సమస్యను తొలగించుకోవచ్చు. కెమికల్ పీలింగ్, లేజర్ టోనింగ్, కార్బన్ పీలింగ్ అనే వైద్య చికిత్సలు కూడా ఉంటాయి. సమస్య తీవ్రతను బట్టి వైద్యులు ఎవరికి కావాల్సిన చికిత్సను వారికి అందిస్తారు.