తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మీ కిచెన్ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? - ఈ టిప్స్​ ట్రై చేస్తే స్మెల్​ పరార్​!

Smelly Kitchen Sink Cleaning Tips : కిచెన్‌ అంటేనే ఘుమఘుమలకు కేరాఫ్‌ అడ్రస్‌. అయితే వంటగదిలో సింక్‌ నీట్​గా లేకపోతే దాని నుంచి వచ్చే దుర్వాసనకు అరనిమిషం కూడా ఉండలేం. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే సింక్​ను ఎప్పుడూ క్లీన్​గా ఉంచుకోవాలి. అయితే అందుకోసం ఎక్కువగా శ్రమించాల్సిన పని లేదు. ఈ టిప్స్​ పాటిస్తే సరిపోతుంది.

Smelly Kitchen Sink Cleaning Tips
Smelly Kitchen Sink Cleaning Tips

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 3:19 PM IST

Best Kitchen Sink Cleaning Tips in Telugu :ఇంట్లో గిన్నెలు శుభ్రం చేయడానికి.. కూరగాయలు కడగడానికి.. చేతులు శుభ్రం చేసుకోవడానికి.. ఇలా ప్రతి చిన్న పనికి మనం ఉపయోగించేది వంటగదిలోని సింక్‌. అయితే దీనిని సరైన విధానంలో వాడకపోయినా, శుభ్రం చేయకపోయినా.. మొత్తం కిచ్​న్​ లుక్‌నే మార్చేస్తాయి. ముఖ్యంగా తరచుగా దీనిని క్లీన్​ చేసుకోకపోతే కీటకాలు, వైరస్​, వివిధ క్రిములకు ఆవాసంగా మారి.. అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే కొందరు పని ఒత్తిడి కారణంగా సింక్(Kitchen sink) శుభ్రత విషయంలో అంత శ్రద్ధ తీసుకోరు. దాంతో వంటగది నుంచి దుర్వాసనలు వస్తుంటాయి. అయితే అలాంటి వాసనలు రాకుండా.. ఎప్పటికప్పుడు మీ సింక్ కొత్తదానిలా తళతళలాడుతూ ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వెనిగర్ :చాలా మంది ముఖ్యంగా మహిళలు కిచెన్​లోనే ఎక్కువ సమయం ఉంటారు. ఆ సమయంలో సింక్ దుర్వాసన వస్తుంటే వంట చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. అలా వచ్చే స్మెల్​ను పోగొట్టాలంటే వెనిగర్​ బెస్ట్​. అందుకోసం ఓ కప్పు నీటిలో 3 కప్పుల వెనిగర్ వేసి కాస్తా బేకింగ్ సోడా, నిమ్మరసం యాడ్ చేసుకొని... ఈ మిశ్రమాన్ని పోసి సింక్ క్లీన్ చేయండి. దీని వల్ల మరకలు, మురికి కూడా.. అలాగే దుర్వాసన కూడా ఇట్టే మాయమవుతుంది.

నాఫ్తలీన్ బాల్స్ : మీ సింక్‌ నుంచి వచ్చే వాసనని దూరం చేయడానికి నాఫ్తలీన్ బాల్స్ కూడా హెల్ప్ చేస్తాయి. సాధారణంగా వీటిని మనం బాత్‌రూమ్స్, అల్మారాల్లో పెడతారు. అలాగే వీటిని సింక్‌ లోపల కాకుండా కింద పైప్ దగ్గర పెట్టండి. దాంతో వాసన అనేది దూరమవుతుంది.

నిమ్మరసం :వీటిని యూజ్ చేయడం ద్వారా కూడా మీ సింక్ క్లీన్ అవుతుంది. అందుకోసం మీరు ఒక బౌల్​లో కాస్త నిమ్మరసం తీసుకొని అందులో ఉప్పు వేసి.. ఆ మిశ్రమాన్ని సింక్‌ మీద పోసి రుద్దండి. ఆ తర్వాత అరగంట సేపు అలాగే ఉంచి.. క్లీన్ చేస్తే సింక్ కొత్తదానిలా తళతళ మెరుస్తుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది.

చేపలు వండినప్పుడు నీచు వాసన వస్తోందా ? అయితే ఈ టిప్స్‌ మీ కోసమే!

పిప్పర్‌మెంట్ ఆయిల్ :మీ కిచెన్ సింక్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్‌ని దూరం చేసేందుకు పిప్పర్‌మెంట్ ఆయిల్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఓ స్ప్రే బాటిల్‌లో కొద్దిగా నీరు పోసి అందులో 10 చుక్కల పిప్పర్​మెంట్ ఆయిల్ వేసి దానిని సింక్ ప్రాంతంలో స్ప్రే చేయాలి. అంతే సింక్ నుంచి వచ్చే దుర్వాసన మాయమవుతుంది.

సబ్బు, బేకింగ్ సోడా, రాక్ సాల్ట్ : సింక్ క్లీన్ చేయడానికి మరో అదిరిపోయే టిప్ ఏంటంటే.. సబ్బు, బేకింగ్ సోడా, రాకింగ్ సాల్ట్‌‌తో కూడిన మిశ్రమంతోనూ ఈజీగా కిచెన్ సింక్ క్లీన్ చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా చాలా వరకూ సింక్ క్లీన్ అవుతుంది. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది.

వేడి నీరు : అదే విధంగా వారానికి ఓ సారైనా సింక్​లో వేడి నీరు పోయండి. ఈ విధంగా పోయడం ద్వారా జిడ్డు మరకలు, వ్యర్థాలు బయటకి వెళ్తాయి. దీంతో పాటు డ్రైనేజీ కూడా క్లీన్ చేస్తుండాలి. ఇలా పైన పేర్కొన్న టిప్స్​తో పాటిస్తూ మీ కిచెన్ సింక్ క్లీన్ చేశారంటే.. దాని నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ పోవడమే కాదు ఎప్పుడూ కొత్త దానిలా కనిపిస్తుంది.

ఈ క్లీనింగ్ టిప్స్ పాటించారంటే - మీ వాష్ బేసిన్ తళతళా మెరిసిపోతుంది!

How to Get Rid of Smell in Bathroom : ఈ టిప్స్ పాటించండి.. మీ బాత్రూమ్ దుర్వాసనొస్తే అడగండి..!

ABOUT THE AUTHOR

...view details