తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఈ టిప్స్​ ఫాలో అయితే- ఇంటి నుంచి బొద్దింకలు పారిపోవడం పక్కా!

How to Get Rid of Cockroaches: మీ ఇంట్లో బొద్దింకలు రాజ్యమేలుతున్నాయా..? వాటిని తరిమికొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్​ కాలేదా..? ఇంటిని జాగ్రత్తగా శుభ్రం చేసుకున్నా.. ఏదో మూల కనిపిస్తూనే ఉన్నాయా..? అయితే వీటిని సింపుల్ టిప్స్​తో ఇంటి నుంచి తరిమేయవచ్చు. ఎలానో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

How to Get Rid of Cockroaches
How to Get Rid of Cockroaches

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 1:06 PM IST

How to Get Rid of Cockroaches in Telugu: బొద్దింకలు.. వీటిని చూస్తేనే కొందరికి శరీరంపై తేళ్లు, జెర్లు పాకినట్లు అవుతుంది. ఇంకొందరు వీటిని చూసి భయపడతారు. ఉదయం పూట ఎక్కుడ దాక్కుంటాయో గానీ.. రాత్రి పూట కిచెన్​, బెడ్ రూమ్, బాత్రూమ్ అన్ని గదులనూ కబ్జా చేస్తాయి. ఇంట్లో తిరుగుతూ ఖాళీగా ఉంటాయంటే.. అదీ కాదు. ఇళ్లంతా తిరుగుతూ బ్యాక్టీరియాలను వ్యాప్తి చేస్తాయి. వంట గిన్నెలు, కూరగాయలు, పండ్లపై తిరుగుతూ.. ఇ-కోలి, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలను స్ప్రెడ్ చేస్తాయి. దీంతో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బొద్దింకల బెడదను వదిలించుకోవడానికి.. ఇంటిని జాగ్రత్తగా శుభ్రం చేసుకున్నా ఏదో మూల కనిపిస్తూనే ఉంటాయి. చాలా మంది వీటిని తరమడానికి మార్కెట్‌లో లభించే స్ప్రేలను తీసుకొచ్చి పిచికారీ చేస్తుంటారు. అందులోఉండే రసాయనాల వల్ల కూడా హెల్త్​ ప్రాబ్లమ్స్​ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో బొద్దింకలను తరిమేయవచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

లవంగం: బొద్దింకలను వదిలించుకోవడానికి లవంగం బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు. దీనికి ఎలాంటి అదనపు శ్రమ అవసరం లేదు. బొద్దింకలు సంచరించే ప్రదేశంలో లవంగాలను పెడితే సరిపోతుంది.

బేకింగ్ సోడా: ఒక చెంచా బేకింగ్ సోడాలో అర చెంచా పంచదార కలిపి బొద్దింక గూడులోని పగుళ్లలో వేయాలి. దీన్ని తినడం వల్ల బొద్దింకలు చనిపోతాయి.

Best Tips to Get Rid of Cockroaches and Lizards: ఈ చిన్న టిప్​తో.. బల్లి, బొద్దింకలు మీ ఇంటివైపు కూడా చూడవు..!

వేప: ఇంటి నుంచి బొద్దింకలు, ఇతర క్రిములను నిర్మూలించడానికి వేపాకులు ప్రభావంతంగా పనిచేస్తాయి. బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో వేపాకులు ఉంచండి. రోజూ ఈ ఆకులను మారుస్తూ ఉండండి. మూడు రోజుల్లో మీరు రిజల్ట్స్ను చూడొచ్చు. లేకుంటే రాత్రి పడుకునే ముందు బొద్దింకలు సంచరించే ప్రదేశాల్లో వేప పొడి లేదా వేపనూనెను రాసుకోవాలి. బొద్దింకల గుడ్లను చంపడానికి.. వేపనూనెలో కొంచెం వేడి నీళ్లు వేసి స్ప్రే చేయండి.

బే ఆకు/బిర్యాని ఆకు: బే ఆకులను పొడిగా చేసినా లేదా విడిగా ఆకులనైనా వేడి నీటిలో ఉడకబెట్టండి. బొద్దింకలు సంచరించే చోట స్ప్రే చేయండి. బొద్దింకలు ఈ వాసనను ఇష్టపడవు. కాబట్టి అవి ఇల్లు వదిలి వెళ్లిపోతాయి.

ఉద్యోగులకు శిక్ష.. పచ్చి కోడిగుడ్లు, బొద్దింకలు మింగాలి!

దాల్చినచెక్క: దాల్చినచెక్కకు ఘాటైన వాసన ఉంటుంది. దీనివల్ల బొద్దింకలకు.. అలెర్జిక్ రియాక్షన్ ఇస్తుంది. దాల్చిన చెక్క పొడిని.. ఉప్పులో కలిపి.. బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో చల్లండి. ఇది బొద్దింకలు, వాటి గుడ్లను కూడా నాశనం చేస్తుంది.

కీరదోస: దోసకాయ ముక్కలను బాగా ఎండబెట్టాలి. ఎండిన ముక్కలను కబోర్డులో, అల్మరాల్లో ఉంచితే బొద్దింక బెడద నుంచి తప్పించుకోవచ్చు. కీరదోస వాసన బొద్దింకలకు పడదు. తాజాగా ఉండే దోసకాయ తొక్క తీసి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో ఉంచితే ఆ వాసనకు రాకుండా ఉంటాయి.

చెవిలో బొద్దింకతో 3 రోజులు.. చివరకు...

బొద్దింక బిర్యానీ..కేరాఫ్ హైదరాబాద్

ABOUT THE AUTHOR

...view details