తెలంగాణ

telangana

By

Published : Sep 13, 2021, 7:00 AM IST

Updated : Sep 13, 2021, 9:19 AM IST

ETV Bharat / sukhibhava

pink lips naturally: పెదవులు నల్లగా ఉన్నాయా? ఇలా చేయండి!

అధరం మధురం.. హసితం మధురం.. అంటారు. ముఖానికి చిరునవ్వే అందం. నవ్వుకు మంచి రంగుతో ఉండే పెదాలే ఆకర్షణ. రసికతకు చిహ్నంగా ఉండే పెదాలతోనే ప్రియమైనవారిని కవ్విస్తుంటాం. అలాంటి పెదాలు కొన్నిసార్లు నల్లగా మారుతుంటాయి. వాటిని లిప్​స్టిక్​ వాడి కవర్​ చేస్తుంటారు కొందరు. అయితే ఎలాంటి లిప్​స్టిక్ వాడకుండా చిన్న చిట్కాలతో సహజంగానే పెదాలను పింక్​ కలర్​లోకి (pink lips naturally) తీసుకురావడం ఎలానో తెలుసుకోండి.

pink lips naturally
పెదాలు ఎర్రగా రావడానికి చిట్కాలు

చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిల్లో ఉండే సమస్య పెదవులు నలుపు రంగులో ఉండటం. అది ట్యాన్ వల్ల కావొచ్చు లేదా కాంప్లెక్షన్ వల్ల కావొచ్చు. మరి కొందరిలో స్మోక్​ చేయడం వల్ల కావొచ్చు. అమ్మాయిలైతే ఆ డార్క్​నెస్​ను కవర్​ చేయడానికి లిప్​స్టిక్​ను వాడేస్తుంటారు. కానీ, అబ్బాయిలు/పురుషులకు అలా కుదరు. అయితే ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోనే పెదాలను డార్క్​నెస్​ నుంచి పింక్​ కలర్​లోకి (pink lips naturally) ఎలా తెచ్చుకోవాలో చూడండి.

చిట్కా 1:

కావాల్సిన పదార్థాలు-పంచదార పొడి (చక్కెరను గ్రైండ్ చేసి పొడిగా చేసుకోవచ్చు) ​, తేనె, కొబ్బరి నూనె

ముందుగా రెండు చెంచాల చక్కెర పొడిని ఓ బౌల్​లో తీసుకోవాలి. అందులో ఒక స్పూన్​ తేనె వేసి బాగా కలుపుకోవాలి. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్​ చర్మానికి చాలా మంచింది. ఆ మిశ్రమంలో ఒక స్పూన్ కొబ్బరినూనె వేసి మరింత కలపాలి. కొబ్బరినూనె నేచురల్ మాయిశ్చరైజర్. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పెదవులపై సర్క్యూలర్ మోషన్​లో రబ్​ చేసి మసాజ్ చేసుకోవాలి. అలా ఓ 10-15నిమిషాల పాటు ఉంచాక నీళ్లతో కడిగేసుకోవాలి,

చిట్కా 2:

కావాల్సిన పదార్ధాలు-పసుపు, పాలు, గ్లిజరిన్

బౌల్​లోకి ఒక స్పూన్ పసుపు తీసుకోవాలి. పసుపు నేచరల్​ యాంటీ సెప్టిక్. ఇది బ్యాక్టీరియాను రాకుండా చేస్తుంది. అందులో ఒక చెంచాడు పాలు, రెండు చుక్కల గ్లిజరిన్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్యాక్​ను నిద్రపోయేముందు పెదాలకు అప్లై చేసుకుని, ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా ఓ నెల రోజుల పాటు చేస్తే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.

చిట్కా 3:

కావాల్సిన పదార్థాలు-బీట్​రూట్, పాలు

బీట్​రూట్​ను చక్కగా కడిగేసుకొని, పేస్ట్ చేసుకోవాలి. బౌల్​లోకి ఒక స్పూన్ పేస్ట్​ తీసుకొని, అందులో కొద్దిగా పాలను కలుపుకోవాలి. దానిని బాగా మిక్స్​ చేస్తే వచ్చే రసాయనాన్ని ప్రతి రోజు రెండు పూటల ఓ దూదితో పెదాలపై అప్లై చేయాలి. బీట్​ రూట్​లో విటమిన్ ఏ, విటమిన్ డీ, ఫైబర్ ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు తమ రెగ్యూలర్ డైట్​లో బీట్​రూట్​ యాడ్ చేసుకుంటే చాలా మంచింది.

చిట్కా 4:

ఎండలో బాగా తిరిగినవారి పెదాలు డ్రై అయిపోతాయి. అలాంటివారు రోజ్ పెటల్స్​లో ఓ స్పూన్​ పాలు పోసి, గట్టిగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో కాటన్ బాల్​తో పెదాలపై రబ్​ చేసుకోవాలి. కాసేపయ్యాక దానిని కడిగేస్తే పెదాలు కాంతివంతంగా, ఆకర్షణీయంగా, పింక్​ కలర్​లో తయారవుతాయి.

ఇదీ చూడండి:పెదాల పగుళ్లు, ముఖంపై మొటిమలు ఎందుకొస్తాయో తెలుసా?

Last Updated : Sep 13, 2021, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details