కొందరు వయసుకు తగిన బరువు లేక బాధపడుతూ ఉంటారు. ఎంత తిన్నా లావు కావట్లేదని దిగులు చెందుతుంటారు. అందరూ బక్కగా ఉన్నావని అంటుంటే ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు. దీంతో తీవ్ర ఒత్తిడితో బరువు పెరగడానికి(How to gain Weight) విఫల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి అసలు బరువు పెరగకపోవడానికి గల కారణాలు తెలుసుందామా?
కారణాలు ఇవేనా?
ముందుగా మీరు సరైన పద్ధతిలో తినడం అలవాటు చేసుకోండి. అందుకోసం వీలైతే న్యూట్రిషనిస్ట్ సహాయం తీసుకోండి. థైరాయిడ్, షుగర్ లాంటి సమస్యలు ఉన్నా కూడా బరువు పెరగరు. అందుకోసం మీరు ఏవైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారా అనేది తెలుసుకోండి.
ఎలా బరువు పెరగొచ్చు..
ముందుగా సరైన వేళల్లో భోజనం తినాలి. మీరు తినే పదార్థాల్లో పోషకాలు సరైన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయాలి. విశ్రాంతి కూడా తగినంత తీసుకోవాలి. ఇవన్నీ చేసినా బరువు పెరగట్లేదు అంటే ఓసారి న్యూట్రిషనిస్ట్‌ను కలిసి సలహా తీసుకోండి.