తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? - ఇప్పుడే చెక్ చేసుకోండిలా! - Best Method to Check Milk Adulteration in Telugu

Adulterated Milk Finding Process : కల్తీ.. ఈ పేరు వింటేనే ప్రజలు హడలెత్తుతున్నారు. ఏది కొనాలన్నా భయపడుతున్నారు. కారణం తాగే వాటి నుంచి.. తినే తిండి వరకు ప్రతిదీ కల్తీయే. అయితే మనం నిత్య ఉపయోగించే పదార్థాల్లో పాలు కూడా ఒకటి. అయితే ప్రస్తుత కాలంలో పాలు కూడా కల్తీ అవుతున్నాయి. కాగా ఈ పాలను గుర్తించడం కష్టమే. కానీ ఇంట్లోనే చాలా ఈజీగా పాలు కల్తీ అయ్యాయో? లేదో..? తెలుసుకోవచ్చంటున్నారు బెంగళూరు ఐఐఎస్​సీ శాస్త్రవేత్తలు..

Adulterated Milk Finding Process
Adulterated Milk Finding Process

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 10:54 AM IST

How to Find Adulterated Milk in Telugu : ‘కల్తీకి కాదేదీ అనర్హం’ అన్నట్లు ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న దాదాపు అన్ని ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి. తాగే నీళ్ల దగ్గర నుంచి.. కారం, నెయ్యి, వంటనూనెలు, పొడులు, మసాలా దినుసులు... ఇలా మార్కెట్లో దొరికే పదార్థాలన్నీ చాలా వరకు కల్తీ ఉత్పత్తులతో కూడి ఉన్నవే. ఇకపోతే ముఖ్యంగా మనమందరం రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి తాగే పాలు కూడా కల్తీ అవుతున్నాయి. కొందరు అడ్డదారుల్లో ఎక్కువ డబ్బు సంపాదించడానికి యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి కెమికల్స్​తో కల్తీ పాలు తయారు చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

Adulterated Milk Find Easily at Home :అయితే ఈ కెమికల్స్ పాలలో నీళ్లలా కలిసిపోవడంతో కల్తీ పాలని గుర్తించడం కష్టంగా మారుతోంది. దీంతో పాలు కల్తీ (Adulterated Milk) అయ్యాయో లేదో తెలుసుకోలేక సామాన్య ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇక కొందరైతే పాలు తాగాలంటే కూడా భయపడిపోతున్నారు. ఇకపోతే పాలు కల్తీయో.. కాదో తెలుసుకోవాలంటే ఒకప్పుడు ల్యాబ్‌లో పరీక్ష చేయించాల్సి వచ్చేది. ఇది ఖర్చుతో కూడుకున్నది. అలాగే ఫలితం తేలడానికి ఎక్కువ సమయం పట్టేది. ఈ నేపథ్యంలో బెంగళూరు ఐఐఎస్​సీ శాస్త్రవేత్తలు.. ఇంట్లోనే చాలా ఈజీగా కల్తీ పాలను తెలుసుకునే విధానాన్ని కనుగొన్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ విధానం ద్వారా మీరు రోజూ తాగే పాలు కూడా స్వచ్ఛమైనవో? కావో? ఇలా చెక్ చేయండి.

ఇది వేసి వేడి చేస్తే.. మూడు రోజులైనా పాలు విరిగిపోవు!

పాలు కల్తీ అయ్యాయని గుర్తించడమెలాగంటే..పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది.. రోజు ఒక గ్లాసు పాలు తాగితే.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రోటిన్‌, విటమిన్‌ ఏ, బి1, బి2, బి12, విటమిన్‌ డి, పొటాషియం, మెగ్నీషయం లాంటి పోషకాలెన్నో పాలలో ఉంటాయి. కానీ, మనం తాగే పాలు నాణ్యమైనవేనా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే.. మనం రోజూ తాగే పాలను వేడి చేయడం ద్వారా అవి కల్తీ పాలా? స్వచ్ఛమైన పాలా? అనేది తెలుసుకోవచ్చని బెంగళూరు ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలను వేడి చేసినప్పుడు అవి ఆవిరయ్యే తీరు ఆధారంగా వాటిలో ఎంతవరకు నీళ్లు లేదా యూరియా కలిసిందో ఈజీగా తెలుసుకోవచ్చని వారు పేర్కొన్నారు.

అదెలాగంటే..

  • మీరు స్వచ్ఛమైన పాలను వేడి చేస్తున్నట్లయితే పాల మధ్యలో బుడగలా వస్తుంది. అలాగే అక్కడే మరుగుతున్నట్లుగా కనిపిస్తుంది.
  • అదే కల్తీ పాలను వేడి చేస్తున్నట్లయితే.. ఈ ప్రక్రియ అనేది స్థిరంగా ఉండదు. మీరు మిల్క్ హీట్ చేస్తున్న పాత్ర అంచుల వరకు పాలు మరుగుతాయి. అయితే ఇది పాలల్లో నీళ్లు ఎంత కలిపారన్నదాన్ని బట్టి మారుతూ ఉంటుందనే విషయం మీరు గమనించాలి.
  • ఇకపోతే యూరియాతో పాలు కల్తీ అయ్యి ఉంటే ఆ పాలు ఆవిరి కావు. పాత్ర అంచుకు చుక్కల్లా అంటుకుంటుందనే విషయం గుర్తుంచుకోవాలి.
  • ఈ విధానం ద్వారా మీరు పాలల్లో 30 శాతం కంటే ఎక్కువ నీరు కలిపినా.. 0.4 శాతం యూరియా కలిసినా ఈజీగా గుర్తించవచ్చని ఐఐఎస్​సీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

పాలు కాని పాలు.. పోషక విలువల్లో రారాజు!

'గాడిదల ఫామ్​' పెట్టిన గ్రాడ్యుయేట్.. ఏటా కోట్ల ఆదాయం.. లీటరు పాలు ఎంతంటే..

ABOUT THE AUTHOR

...view details