నిద్రపోవడానికి నానా అవస్థలు పడుతుంటారు కొందరు. నిద్రించే సమయం కన్నా నిద్ర పట్టేందుకు ఎక్కువ సమయం కేటాయించే వారూ చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారు కొన్ని పద్ధతులు అనుసరిస్తే.. తక్కువ సమయంలోనే నిద్రలోకి జారుకుంటారని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పద్ధతులేంటో తెలుసుకుందాం.
సైన్స్ ఆధారిత ఉపాయాలు..
10 సెకన్లలో నిద్రపట్టడం మ్యాజిక్‌లా అనిపిస్తుంది. కానీ, కొన్ని పద్ధతులు అవలంభిస్తే ఇట్టే నిద్రపట్టడం అలవాటైపోతుంది.
సైనిక పద్ధతి(The military method)
'రిలాక్స్ అండ్ విన్: ఛాంపియన్షిప్ పర్ఫార్మెన్స్' పుస్తకం ఆధారంగా షరోన్ అకెర్‌మెన్ ఈ పద్ధతిని వెలుగులోకి తీసుకొచ్చారు. పైలట్లకు రెండు నిమిషాలు లేదా అంతకన్నా తక్కువ సమయంలో నిద్రపట్టేలా.. అమెరికా నేవీ ప్రీ-ఫ్లైట్ స్కూల్ ఈ పద్ధతిని అవలంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆరు వారాల సుదీర్ఘ ప్రాక్టీస్ అనంతరం.. ఈ పద్ధతి విజయవంతమైందని తెలిపారు.
కాఫీ తాగినా, తుపాకుల శబ్దాలు వినిపిస్తున్నా.. ఈ పద్ధతి ద్వారా పైలట్లకు తక్కువ సమయంలోనే నిద్రపట్టే అలవాటు చేయడం విశేషం.
ఈ విధంగా చేస్తే సరి..
- ముఖాన్ని, నోటిలోని కండరాలను పూర్తిగా రిలాక్స్ చేయాలి.
- రెండు భుజాలను ఫ్రీగా వదిలేయాలి. చేతులను శరీరానికి రెండు పక్కల పెట్టేయాలి. ఇలా చేస్తే ఒత్తిడి ఉండదు.
- ఛాతిని రిలాక్స్ చేస్తు.. ఊపిరి వదలుతుండాలి.
- కాళ్లు, తొడలు రిలాక్స్ చేసుకోవాలి.
- 10 సెకన్లపాటు మెదడులో ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండాలి.
- ఎలాంటి ఆలోచన లేకుండా ఉండటం సాధ్యం కాకపోతే.. 'ఏమీ ఆలోచించకు' అని పది సెకన్లపాటు చెబుతుండాలి.
- 10 సెకన్లలో నిద్రలోకి జారుకుంటారు.
ఈ పద్ధతితో 10 సెకన్లలో నిద్రపట్టడం సాధ్యపడట్లేదని అనిపిస్తే.. శ్వాస, కండరాల రిలాక్సింగ్పై శ్రద్ధ పెట్టాలి. ఆందోళన, ఏడీహెచ్‌డీ మొదలైన సమస్యలు అదుపుచేసుకునే ప్రయత్నం చేస్తుండాలి.
60 సెకన్లలో నిద్ర పట్టాలంటే..
60 సెకన్లలో నిద్రపట్టడం అలవాటు చేసుకునేందుకు రెండు పద్ధతులున్నాయి. ఈ పద్ధతులను అనుసరిస్తే.. ఆలోచనలు మానుకుని త్వరగా నిద్రలోకి జారుకుంటాం.
4-7-8 శ్వాస పద్ధతి
ధ్యానం, విజువలైజేషన్ విధానాలను ఉపయోగించి శ్వాస పద్ధతిని మెరుగ్గా అమలు చేయవచ్చు. శ్వాసకోశ సమస్యలున్నవారు ఈ పద్ధతిని ప్రారంభించడానికి ముందు డాక్టర్లను సంప్రదించడం శ్రేయస్కరం.
ఈ పద్ధతిని అమలు చేసేందుకు.. నోటి పైభాగానికి వ్యతిరేకంగా నాలుక కొనను రెండు పళ్ల వెనుక ఉంచి పెదాలు మూసేయాలి.
- శ్వాస వదిలేసే సమయంలో పెదాలను కాస్త తెరవాలి. చిన్నగా శబ్దం చేస్తూ శ్వాస వదలాలి.
- నోరు మూసేసి.. ముక్కు ద్వారా శ్వాస పీల్చాలి. మదిలో నాలుగు వరకు అంకెలు లెక్కించుకోవాలి.
- 7 సెకన్లపాటు శ్వాసను నిలుపుకోవాలి.
- తర్వాత 8 సెకన్లపాటు శ్వాసను విడవాలి.
- ఏదో చేస్తున్నాం అని ఆలోచిస్తూ చేయకుండా.. మన ప్రమేయం లేకుండానే చేస్తున్నట్లు ఈ ప్రక్రియ సాగాలి.
- నాలుగు సార్లు ఈ ప్రక్రియను కొనసాగించాలి. ఈలోగా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు.
ప్రోగ్రెసివ్ మజిల్ రిలాగ్జేషన్(పీఎంఆర్)