తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఐస్​క్రీమ్ ఇలా లాగించేయండి - నో టెన్షన్!

Eat Ice Cream Without Gain Weight : ఐస్​క్రీమ్.. ఈ పేరు చెబితేనే చాలా మందికి నోరూరిపోతుంది. ఇక చిన్నపిల్లల గురించి చెప్పాల్సిన పనేలేదు. అయితే.. ఐస్​ క్రీమ్ తింటే బరువు పెరుగుతామని కొందరు టెన్షన్ పడుతుంటారు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ భయం ఎక్కువ. కానీ.. వెయిట్ పెరగకుండా ఐస్​క్రీమ్​ లాగించేయొచ్చని మీకు తెలుసా?

Eat Ice Cream Without Gain Weight
Eat Ice Cream Without Gain Weight

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 2:51 PM IST

How to Eat Ice Cream Without Gain Weight :ఐస్​క్రీమ్.. మంచి రుచిగా ఉండడమే కాదు.. సూపర్ మూడ్ బూస్టర్​గా కూడా పనిచేస్తుంది. ఇది తిన్నవారిలో ఒత్తిడి మాయమైపోతుంది. అయితే.. బయట తయారుచేసే ఐస్‌క్రీమ్స్‌(Ice Creams)లో చక్కెర అధిక మొత్తంలో ఉంటుంది. దాంతో ఐస్​క్రీమ్ తింటే బరువు పెరుగుతామనే భయంతో చాలా మంది తినకుండా ఉండిపోతారు. ఇలాంటి వారు బరువు పెరగకుండానే ఐస్​క్రీమ్ తినొచ్చు!

హెల్దీ ఐస్ క్రీమ్​ ఎంచుకోవాలి :అన్ని ఐస్​క్రీమ్​లు ఒకేలా తయారుచేయరు. కాబట్టి.. కేలరీలు, చక్కెరతోపాటు కొవ్వు తక్కువగా ఉండే తేలికపాటి ఐస్​క్రీమ్​లు తీసుకోవచ్చు. అదేవిధంగా.. డెయిరీ ఫ్రీ, వీగన్ ఆప్షన్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి.

How to Make Khubani Ka Meetha Telugu: ఖుబానీ కా మీఠా.. టేస్ట్​ అదుర్స్​.. ఐస్​క్రీమ్​తో తింటే ఆ మజానే వేరు..!

హెల్తీ టాపింగ్స్ యాడ్ చేసుకోండి :ఐస్​క్రీమ్​కు హెల్తీ టాపింగ్స్ యాడ్ చేసుకోవడం ద్వారా.. దాని పోషక విలువలు మెరుగుపరుచుకోవచ్చు. ఇందుకోసం బెర్రీలు, ముక్కలుగా తరిగిన అరటిపండ్లు లేదా మామిడికాయ ముక్కలు వంటి తాజా ఫ్రూట్స్ యూజ్ చేయొచ్చు. అవి రుచితోపాటు అవసరమైన విటమిన్లను అందిస్తాయి. క్రంచ్ కోసం కొన్ని గింజలు లేదా గ్రానోలా వంటివి ఐస్​ క్రీమ్​పై చల్లుకుంటే సూపర్​గా ఉంటుంది.

హోమ్​ మేడ్ ఐస్‌క్రీమ్​కు ప్రాధాన్యత ఇవ్వండి :చాలా మంది బయట దొరికే ఐస్​క్రీమ్స్ మాత్రమే ఎక్కువగా తింటుంటారు. అలాకాకుండా ఇంట్లో తయారుచేసుకొన్న వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. వాటిలో ఏం యూజ్ చేస్తున్నామన్న దానిపై మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. గ్రీక్ పెరుగు, కొబ్బరి పాలు లేదా స్టెవియా వంటి నేచురల్ స్వీట్​నర్లు వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో ఐస్ క్రీమ్స్ తయారుచేసుకోండి. అలాగే మీ సృజనాత్మకతతో సహజ పదార్థాలు లేదా తాజా పండ్లను యాడ్ చేసి మంచి రుచికరమైన ఫ్లేవర్స్ ను ఆస్వాదించండి.

చురుకైన జీవనశైలిని కొనసాగించండి : ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయాలంటే.. తప్పకుండా ఎక్సర్ సైజ్ చేయాలి. బరువు నియంత్రణలో రెగ్యులర్ వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. రోజూ నడక, సైక్లింగ్ లేదా డ్యాన్స్ వంటి మీరు ఆనందించే పనులు చేయాలి. వీటి ద్వారా అదనపు కేలరీస్ బర్న్ అయిపోతుంటాయి.

ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు ఐస్ క్రీమ్ తిన్నా కూడా.. మీ ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్టూ పడదు. ఒకవేళ అడిషనల్ కేలరీలు ఒంట్లోకి వెళ్లినా.. వ్యాయామం ద్వారా కరిగిపోతాయి. కాబట్టి.. మీ మూడ్ బాలేనప్పుడైనా, ఐస్​క్రీమ్ తినాలనే కోరిక కలిగినప్పుడైనా చక్కగా లాగించేయండి.

Kalti ice cream in Hyderabad : మీ పిల్లలు తింటోంది ఐస్​క్రీమా లేక చల్లని విషమా..?

Fake Ice Cream : పిల్లలకు ఐస్‌క్రీం కొనిస్తున్నారా.. బీ కేర్​ఫుల్​..!

ABOUT THE AUTHOR

...view details