తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

నడుము, తొడలకు మేలు చేసే పృష్టాసనం! - పృష్టాసనం లాభాలు

యోగా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. నిపుణుల సలహా మేరకు పలురకాల ఆసనాలను ప్రయత్నించి సత్ఫలితాలు పొందవచ్చు. కుర్చీ సాయంతో వేసే పృష్టాసనం ద్వారా నడుము, తొడలకు మేలు జరుగుతుంది. మరి దీనిని ఎలా వేయాలో తెలుసుకుందామా!

pristhasana
పృష్టాసనం

By

Published : Oct 6, 2021, 9:58 AM IST

పృష్టాసనం సాధారణంగానే కష్టతరమైన ఆసనం. ఈ ఆసనం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా నడుము, తొడలకు ఈ ఆసనం ద్వారా మేలు జరుగుతుంది. కుర్చీ సాయంతో ఈ పృష్టాసనాన్ని ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చేసే విధానం..

  • ముందుగా కుర్చీని మ్యాట్ కొనభాగంలో పెట్టాలి.
  • తొడలు, నడుం భాగాలను స్ట్రెచ్​ చేయడానికి బద్దకోణాసనం వేయాలి. తొడలను పైకి, కిందకి అంటూ, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ.. నడుం నిటారుగా ఉంచి వార్మప్ చేయాలి.
  • కొద్ది సమయం పాటు ఈ ఆసనం వేశాక మోకాళ్లపై కూర్చోవాలి. అనంతరం రెండు చేతులను మ్యాట్​పై ఉంచి ఎడమ కాలిని కుర్చీపై పెట్టాలి. కాలి వేళ్లను మనవైపు లాగాలి. మోకాలిని కుర్చీపై స్ట్రెస్​ చేయకుండా ఛాతిని బాగా పైకి లేపి కుడికాలిని నెమ్మదిగా అరచేయి బయటి భాగంలోకి తెచ్చిపెట్టాలి. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ అలాగే ఉండాలి. ఇది పృష్టాసనం.
  • ఎడమవైపు శరీర భాగమంతా సూటిగా అయిపోతుంది. కుడికాలు తొడకింద, కుడి మోకాలుపై ఎక్కువగా స్ట్రెచ్ పడుతుంది. ఆ పృష్ట భాగాలను కొద్దిగా కిందకు అని తలను కొద్దిగా పైకి లేపాలి.
  • ఈ విధంగా ఆసనం చేసేటప్పుడు ఓ చెక్క ముక్కని ఎడమ చేతికింద పెట్టుకుని, ఆ చెక్కముక్క ఎత్తును కూడా కాస్త పెంచుకుని చేస్తే.. స్ట్రెచ్​ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో.. ఛాతిని ముందుకు అంటూ, పృష్ట భాగాలను కిందికి చేస్తూ ముందువైపు చూడాలి.
  • ఛాతిని ముందుకు చేసి కళ్లను మూసేసి కూడా ఈ ఆసనంలో ఉండవచ్చు.
  • ఆ తర్వాత నెమ్మదిగా కుడి మోకాలును వెనక్కి తీసుకెళ్లి ఎడమ కాలును కిందికి తీసుకురావాలి. అనంతరం కుడికాలును కుర్చీపై పెట్టి ఎడమ కాలును ముందుకు తీసుకువచ్చి కూడా ఈ ఆసనం వేయాలి.
  • చాలా మంది.. మెకాలను, మడిమను ఒక్క లైన్​లో పెట్టరు. అలా పెట్టకపోతే మన మోకాళ్లలో సమస్యలు వచ్చే అవకాశముంది. మెకాలిని కుర్చీపై స్ట్రెస్​ చేయకుండా బెడ్ షీట్ లేదా దిండును కూడా ఉపయోగించి ఈ ఆసనం సులభతరం చేసుకోవచ్చు.
  • ఈ విధంగా కొద్ది సమయం పాటు ఆసనంలో ఉండి మోకాలును నెమ్మదిగా కిందికి తీసుకురావాలి.

లాభాలు..

తొడలను ఆకారానికి తీసుకురావడానికి, పృష్ట భాగాలను టోన్​అప్ చేయడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. కుడి మోకాలు నుంచి ఎడమకాలు మోకాలు కింది భాగం వరకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. నడుములోని కొవ్వు కూడా కరుగుతుంది.

ఇదీ చదవండి:

Supta vajrasana yoga: మీలో ధైర్యాన్ని నింపే ఆసనం ఇది!

ABOUT THE AUTHOR

...view details