రజస్వల అయినప్పటి నుంచి అమ్మాయిల్లో రుతుస్రావ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సమయంలో కొంతమంది అమ్మాయిల్లో తీవ్ర రక్తస్రావం అవుతుంది. ఇలాంటి సమస్యలని వారు బయటికి చెప్పుకోలేక సతమతమవుతారు. పెళ్లై పిల్లలు పుట్టినా కూడా వారికి ఎన్నో రకాల గర్భాశయ సమస్యలు(Gynic Problem) వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కాన్పు అయిన తర్వాత, వయసు మళ్లినప్పుడు ఎన్నో రకాల సమస్యలొస్తుంటాయి. యోనిలో తెల్లపొర, బాధలేని రక్తస్రావం, గర్భాశయం దగ్గర పుండు(Womb Infection), దురద ఇలా ఎన్నో చెప్పుకోలేని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు వారు శృంగారంలో పాల్గొనలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అలాంటి వారు ఈ సమస్యలను ఎలా అధిగమించాలి? భవిష్యత్తులో ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే ఆసక్తికరమైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కాన్పులైన స్త్రీలో గర్భాశయం పుండుపడటం ఎందుకు జరుగుతుంది?
కాన్పు అయిన తర్వాత కొంత మందిలో ఈ సమస్య కనిపిస్తుంది. కాన్పు ఎక్కువైనప్పుడు గర్భాశయం(Womb Infection After Birth) దగ్గర చీరుకుపోవడంలాంటిది జరుగుతుంది. అలా జరిగినప్పుడు గర్భాశయానికి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇన్ఫెక్షన్ లేకపోయినా అక్కడ పుండుపడినట్లు ఎర్రగా తయారవుతుంది. మరికొందరికి గడ్డలా తయారవుతుంది. దీన్ని సెర్విసైటిస్ అని అంటాం. ఈ ప్రక్రియలో గర్భాశయం మొదటి భాగం నుంచి చీరడం వంటివి జరుగుతుంటాయి. దీన్ని ముందుగానే గమనించి మందులు వాడితే తప్పకుండా నయమవుతుంది.
వయసు మళ్లిన స్త్రీలు శృంగారంలో పాల్గొంటే బాధలేని రక్తస్రావం వస్తుందా?