తెలంగాణ

telangana

By

Published : Oct 3, 2021, 5:00 PM IST

Updated : Dec 23, 2022, 4:34 PM IST

ETV Bharat / sukhibhava

high BP control: హై బీపీని అదుపు చేయటం ఎలా?

అధిక రక్తపోటు. దీన్నే మనం హైబీపీ, హైపర్​టెన్షన్​ అని పిలుస్తుంటాం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎన్నో రకాల సమస్యల్ని తెచ్చి పెడుతుంది. మెదడు, గుండె, కిడ్నీ వంటి శరీర భాగాల్ని కూడా పాడుచేస్తుంది. ఇలాంటి జబ్బును ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకుందాం!.

high bp control in telugu
హై బీపీని అదుపు చేయటం ఎలా?

రక్తం మనకు ప్రాణాధారం. దేహంలో అణువణువుకు జీవాధారం. ప్రాణ వాయువును, పోషకాలను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తుంది. గుండె లబ్​ డబ్​ అంటూ అన్ని భాగాలకు పంపించే పని చేస్తుంది. హృదయ స్పందన జరిగిన ప్రతిసారి రక్తాన్ని బయటకు నెడుతుంది. ఇలా రక్తనాళాల లోపలి గోడలపై కొంత ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడినే మనం రక్తపోటు(బీపీ) అంటాం. సాధారణంగా 120/80 ఉండాలి.

కారణాలు..

మారుతున్న జీవనశైలితో సాధారణంగా నేటి రోజుల్లో మనందరిలో అధిక రక్తపోటు ఉంటోంది. జన్యులోపాలు, అధిక బరువు, కొలెస్ట్రాల్​, ధూమపానం, వ్యాయామం చేయకపోవడం, ఆల్కహాలు అలవాట్లు రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణాలు.

అదుపు చేయటం ఎలా?..

మంచి ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలి. ఆహారంలో ఉప్పు తగ్గించటం, ధూమపానం, ఆల్కహాల్​ సేవించకుండా జీవనశైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ వ్యాయామం చేయటం వల్ల 50 శాతం వరకు వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చు. రక్తపోటును పూర్తిగా నివారించే మార్గాలు ప్రస్తుతం లేవు. మందులు వేసుకుంటూ బీపీని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియోను చూడండి.

ఇదీ చదవండి:Childhood Obesity: చిన్న పిల్లల్లో స్థూలకాయం- కారణాలు ఇవే!

healthy lifestyle: పోషకాహారంతోనే విజయం!

Last Updated : Dec 23, 2022, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details