తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మందులు వాడినా చుండ్రు పోవడం లేదా? ఇలా చేస్తే రిజల్ట్స్ పక్కా! - మందులు వాడితే చుండ్రు పోతుందా

చాలా మంది చుండ్రుతో బాధపడతారు. ఇది ఒకసారి వస్తే అంత సులభంగా పోదు. చికిత్స కోసం చర్మసంబంధ వ్యాధుల నిపుణుల్ని సంప్రదిస్తారు. కొన్ని సార్లు మందులు వాడినప్పటికీ.. తగ్గదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే..!

how to control dandruff
how to control dandruff

By

Published : Apr 29, 2023, 12:12 PM IST

సాధరణంగా ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు చుండ్రు వస్తుంది. చాలా మంది ఈ సమస్యతో బాధపడే ఉంటారు. నివారణ కోసం చర్మవ్యాధి సంబంధ వైద్యులకు చూపించుకుంటారు. వారు ఇచ్చిన మెడిసిన్ వాడినప్పటికీ కొన్ని సార్లు పూర్తిగా నయం కాదు. మరి సమస్య నుంచి బయటపడాలంటే ఇలా చేయాలి.
అంతకంటే ముందు అది చుండ్రా లేదా.. మన తలపై ఉన్న చర్మం పొడిగా ఉందా అనేది నిర్ధరించుకోవాలి. ఒకవేళ చుండ్రు అయితే తెల్లగా, పొట్టులాగా ఉంటుంది. అదే డ్రై స్కాల్ప్ అయితే.. అక్కడ చర్మం పొడిగా ఉండి చికాకుగా అనిపిస్తుంది. ఈ సమస్య అయితే అంత సులభంగా తగ్గదు.

చుండ్రు ఎందుకు వస్తుంది?
సాధారణంగా చుండ్రు ఫంగస్ మూలంగా వస్తుంది. ఇది సహజంగానే మన తలమీది చర్మంలో ఉంటుంది. కొంతమందిలో ఇక్కడ నూనె విడుదల ఎక్కువగా ఉంటుంది. ఇలా జరగటం వల్ల ఫంగస్ పెరిగి చుండ్రు అవుతుంది. ఇక్కడి మృతకణాల వల్ల.. ఫ్లేక్స్​గా ఏర్పడి సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. దీని వల్ల దురద ఎక్కువగా ఉంటుంది.

మందులు వాడినా చుండ్రు పోవడం లేదా? ఇలా చేస్తే ఫలితముంటుంది

పరిష్కారం ఇదే
చుండ్రు ఎక్కువగా ఉంటే యాంటీ ఫంగల్ షాంపులతో తరచుగా తలస్నానం చేయాలి. సెలీనియం సల్ఫైట్, కిటకొనొజాల్ ఉన్న షాంపులు వాడితే ఫలితం ఉంటుంది. సహజంగా అయితే.. యాపిల్ సిడార్బెనిక్, టీ ట్రీ ఆయిల్ వాడటం, నిమ్మకాయ రాసుకోవడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది. అదే పొడిచర్మ సమస్య అయితే.. వారానికోసారి తలస్నానం చేయాలి. తక్కువ మోతాదులో, మాయిశ్చరైజింగ్ ఉన్న షాంపులను వాడాలి. తలస్నానం చేసేముందు కచ్చితంగా నూనె పెట్టుకోవాలి. దీంతో పాటు కండీషనర్ రాసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పళ్లకి క్లిప్పులు పెట్టినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
ఎత్తుగా ఉన్న, ఎగుడు దిగుడు, వంకరగా ఉన్న పళ్లను సరిచేయడానికి క్లిప్పులు పెడతారు. ఇవి పెట్టుకున్న తర్వాత కొంచెం నొప్పి, తినడానికి అసౌకర్యంగానూ ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉన్న సమయంలో అవసరాన్ని బట్టి పెయిన్ కిల్లర్, డోలో తీసుకోవచ్చు. నార్మల్ పెయిన్ ఉంటే.. ఏమేం తినగలుగుతారో అవన్నీ తినొచ్చు.

అయితే తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి.

  • క్లిప్పుల మధ్యలో ఇరుక్కున్న పదార్థాల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
  • క్లిప్స్ ఊడిపోయే పదార్థాలు అంటే మొక్కజొన్న, క్యారెట్ లాంటి వాటిని తినకపోవడమే ఉత్తమం. గట్టిగా ఉండే పదార్థాలకు దూరంగా ఉంటే బెటర్. ఎందుకంటే అవి తినడం వల్ల నొప్పి వచ్చే అవకాశాలుంటాయి.
  • బంకగా ఉండే వాటిని మొత్తానికే తినకుండా ఉండాలి. ఎందుకంటే అవి తిన్న తర్వాత బ్రష్ చేసినా కానీ పోవు. అవి క్రమంగా కుళ్లిపోయి పళ్లు పుచ్చిపోవడానికి, చిగుళ్ల జబ్బులకు దారితీసే అవకాశముంది.
  • ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి పంటి నొప్పులు, కేవిటీలు, చిగుళ్ల నొప్పులు రాకపోవడంతో పాటు క్లిప్పుల వల్ల పళ్లు అందంగా, ఆకర్షణీయంగా కనబడతాయి.

ABOUT THE AUTHOR

...view details