How to Choose Best Hair Brushes for Men and Women : అందంగా కనిపించడంలో ముఖం తర్వాత స్థానంలో హెయిర్ స్టైల్ ఉంటుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వేడుకకు తగ్గట్టుగా రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టుగానే.. డ్రెస్సింగ్ నుంచి హెయిర్‌స్టైల్ వరకు ప్రతి ఒక్కటీ పర్ఫెక్ట్గా మెయింటెన్ చేస్తున్నారు. అయితే.. చాలా మందికి తమకు ఏ హెయిర్ స్టైల్ బాగుంటుందో క్లారిటీ ఉండదు. ఒకవేళ ఉన్నా.. అందుకు ఎలాంటి బ్రష్ సరిపోతుందో తెలియదు. ఏదో ఒక బ్రష్ వాడితే.. హెయిర్ స్టైల్ అనుకున్నట్టుగా రాదు. అందుకే.. హెయిర్‌కు తగ్గట్లుగా ఏ బ్రష్ వాడాలో ఆ లిస్ట్‌ను మీకోసం తీసుకొచ్చాం. మరి ఇంకెందుకు లేట్.. ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే ఈ లోపాలు మీలో ఉన్నట్లే!
జుట్టు రకాన్ని గుర్తించడం: సరైన హెయిర్ బ్రష్‌ను ఎంచుకోవడానికి ముందుగా చేయవలసినది.. మీ జుట్టు రకాన్ని అర్థం చేసుకోవడం. మీ జుట్టు స్ట్రెయిట్ అయితే పాడిల్ బ్రష్(Paddle Brush) అద్భుతాలు చేస్తుంది. మీది కర్లీ హెయిర్ అయితే వెడల్పు దంతాలు కలిగిన దువ్వెన ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జుట్టు స్మూత్‌గా ఉంటే.. సాఫ్ట్ బ్రిస్టల్ బ్రష్ యూజ్ అవుతుంది. అలాగే మీది మందపాటి లేదా ముతక జుట్టు అయితే దృఢమైన బ్రష్ అవసరం. ఇలా.. మీ జుట్టు రకానికి సరిపడే బ్రష్‌తో మీకు నచ్చిన హెయిర్ స్టైల్‌ను సులువుగా వేసుకునేందుకు అనువుగా ఉంటుంది.
స్కాల్ఫ్ ఆరోగ్యాన్ని గమనించాలి:మీ స్కాల్ప్ ఆరోగ్యాన్నీ చూసుకోవాలి. ఒకవేళ మీరు జుట్టు రాలడం లేదా చుండ్రు సమస్యతో బాధపడుతున్నట్లయితే.. సహజమైన బ్రిస్టల్స్‌తో కూడిన బ్రష్‌లను ఎంచుకోండి. ఇవి నెత్తిమీద సున్నితంగా ఉంటాయి. చికాకును తగ్గిస్తాయి. ఉదాహరణకు.. ఒక బోర్ బ్రిస్టల్ బ్రష్ సహజ నూనెలను పంపిణీ చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన స్కాల్ప్‌ను ప్రోత్సహిస్తుంది. అలాగే చుండ్రును తగ్గిస్తుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అధ్యయనం ప్రకారం.. సరైన స్కాల్ప్ కేర్ మొత్తం జుట్టు ఆరోగ్యానికి దోహదం చేస్తుందని.. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను తగ్గిస్తుందని స్పష్టం చేసింది.
జుట్టు పొడవును అంచనా వేయడం:మీ జుట్టు పొడవును బట్టి మీ బ్రష్ ఎంపిక చేసుకోవాలి. పొడవాటి జుట్టు కోసం.. పొడవైన బ్రిస్టల్స్‌తో కూడిన బ్రష్‌ను ఎంచుకోవాలి. అలాగే చిన్న జుట్టు దువ్వుకోవడానికి చిన్న బ్రష్‌లను ఉపయోగించాలి.