How to Check the Quality of Almonds: కరోనా తర్వాత ప్రజల జీవన విధానంలో చాలానే మార్పులు వచ్చాయి. ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఆరోగ్యంపై చాలా మంది అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫుడ్ విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సమతుల్య ఆహారానికి(గుడ్లు, మాంసం, పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్) ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో బాదం పప్పుకు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఎక్కువగా బాదం తినడానికి మొగ్గు చూపుతున్నారు. కారణం.. అందులో లభించే పోషకాలు. అయితే రోజూ తినే బాదంపప్పు స్వచ్ఛత, నాణ్యతపై చాలా మందికి అనుమానం ఉంటుంది. అసలు ఏదో..? నకిలీ ఏదో..? తెలియక మార్కెట్లో లభించే వాటిని కొనుక్కోని తింటున్నారు. మరి బాదం నాణ్యతను ఇంట్లోనే ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..?
పోషకాల పవర్‌హౌజ్ బాదం: ఇందులోమోనోశాచురేటెడ్ కొవ్వు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రొటీన్,ఫైబర్, విటమిన్ E, K, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ లాంటి పోషకాలు ఎన్నో ఉంటాయి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, కండరాలకు బలం చేకూర్చడం, జీర్ణక్రియ మెరుగుపర్చడం లాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.. మరి ఇంట్లోనే బాదం నాణ్యతను ఎలా చెక్ చేయాలంటే...
రోజూ అరటిపండు తినడం లేదా? - అయితే ఈ హెల్త్ బెనిఫిట్స్ మిస్ అయినట్లే!
కలర్:బాదం స్వచ్ఛతను, నాణ్యతను తనిఖీ చేయడానికి ముందుగా చేయాల్సింది.. వాటి రూపాన్ని, రంగును, షేప్‌ను చూడటం. మంచి నాణ్యమైన బాదంపప్పులు చక్కని గోధుమరంగులో ఉండి, మచ్చలేని ఆకృతితో ఉంటాయి. బాదంపప్పు రంగు మారినా, ఎక్కువగా ముదురు రంగులో కనిపించినా అది నకిలీది అని గుర్తించాలి.
రుచి:బాదం సాధారణంగా తీపి రుచితో ఉంటుంది. అలాకాకుండా రుచిలో చేదు ఉన్నట్లయితే, బాదంపప్పు సరిగా లేదని అర్థం. ఎందుకంటే ఇది బాదం బయటి పొరలో సహజమైన టాక్సిన్ అయిన ఫైటిక్ యాసిడ్ వంటి కొన్ని రసాయనాలుంటాయి. ఇక కొన్ని మురికి వాసన వస్తే, అవి చెడిపోయినట్లు గమనించాలి. అలాగే బాదంపప్పులను చేతితో పట్టుకున్నప్పుడు.. పొడిగా.. గట్టిగా ఉండాలి. అలా కాకుండా తేమగా లేదా మృదువుగా ఉంటే అవి నకిలీవని అర్థం.