పండ్లు... పుచ్చకాయ తీసుకునేటప్పుడు దాని పైన తట్టండి. డొల్ల శబ్దం వస్తే సరి. గట్టి శబ్దం వస్తే తీసుకోవద్దు. యాపిల్ తొక్క మృదువుగా, మచ్చలు లేకుండా ఉండాలి. అలానే నిమ్మ, నారింజ, కమలా వంటివి తాజా వాసన ఉండాలి. కర్భూజ తీసుకునేటప్పుడు దాని తొడిమ భాగంలో నొక్కితే మెత్తగా ఉన్నా లేక తీపివాసన వస్తున్నా బాగా పండినట్లు లెక్క. ద్రాక్షా కుళ్లిన దశలో ఉన్నవి మాత్రమే రాలిపోతుంటాయి. కాబట్టి గుత్తులనే ఎంచుకోవాలి.
దుంపలు... చిలగడదుంప, క్యారెట్, బీట్‌రూట్, బంగాళదుంప, ముల్లంగి.. మొదలైన దుంపల్ని ఎంచుకునేటప్పుడు వాటిని చేతిలోకి తీసుకుని బరువు చూడాలి. అవి తేలికవైతే పక్కన పెట్టేయండి. బరువుగా ఉండి, తొక్క కూడా మృదువుగా ఉన్నవాటిని మాత్రమే ఎంచుకోండి. ముఖ్యంగా బంగాళదుంపలు ఏరేటప్పుడు ఆకుపచ్చరంగు ఉన్నా, మొలకలు ఉన్నా తీసుకోవద్దు. ఎందుకంటే వాటిల్లో సొలనైన్ అనే హానికర రసాయనం ఉంటుంది.