How To Avoid Fish Smell In Kitchen : చాలా మంది ఇళ్లల్లో నాన్‌వెజ్ వండుకుంటారు. అందులో ఫస్ట్ ప్రయారిటీ చికెన్ అండ్ ఫిష్. అయితే కిచెన్‌లో నాన్‌వెజ్ వండినప్పుడు వచ్చే నీచు వాసన వెంటనే పోదు. ముఖ్యంగా చేపల విషయంలో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. వంట వండటం పూర్తై గిన్నెలు శుభ్రం చేసిన తర్వాత కూడా ఆ వాసన పోదు. దీనివల్ల కిచెన్‌లోకి అడుగు పెట్టాలంటే ముక్కు ముసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ నీచు వాసనకు పరిష్కారంగా కొన్ని చిన్న టిప్స్‌పాటిస్తే సరిపోతుంది. ఆ చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నీచు వాసనను తగ్గించే చిట్కాలు :
Tips to Avoid Fish Smell in Kitchen:
కాఫీ గింజలతో :ఓ గిన్నెలో కొద్దిగా వెనిగర్, కొద్దిగా కాఫీ పొడిని కౌంటర్ టాప్‌లో ఉంచితే నీచు వాసన రాకుండా ఉంటుంది. కాఫీ గింజలను వేయించినా కూడా ఆ వాసనతో ఈ సమస్య దూరమవుతుంది.
ఎయిర్ ఫ్రెషనర్స్ :కొంత మంది వంట వండిన తరవాత వెంటనే చెడు వాసన వస్తోందని ఎయిర్ ఫ్రెషనర్స్‌ను ఉపయోగిస్తుంటారు. కిచెన్‌లో చేపలను వండిన వెంటనే ఇవి వాడొద్దు. ఎందుకంటే ఎయిర్ఫ్రెష్నర్ స్మెల్ వంటలకు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వంట పూర్తైన తరవాత వండిన గిన్నెలను పక్కన పెట్టి.. తర్వాత ఫ్రెషనర్స్ వాడొచ్చు.
దాల్చిన చెక్కతో వాసనకు చెక్!:ఒక పాత్రలో కొన్ని నీళ్లు పోసి దాన్ని స్టవ్ మీద మీడియమ్ మంటపై మరిగించాలి. ఆ నీటిలోకి కొన్ని దాల్చిన చెక్క ముక్కలు లేదా పొడి వేయాలి. దీంతో కిచెన్‌లోని నీచు వాసన తొలగిపోయి, మంచి వాసన వస్తుంది. దాల్చిన చెక్కకు బదులుగా కాఫీ గింజలు లేదా నిమ్మ, ఆరెంజ్, యాపిల్ తొక్కల్ని లవంగాలతో కలిపి వేసి మరిగించినా మంచి ఫలితం ఉంటుంది.
క్యాండిల్స్ వెలిగించండి :ప్రస్తుతం వివిధ రకాల డిజైన్లు, మోడళ్లలో ఉన్న సెంటెడ్ క్యాండిల్స్ మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. వాటిని వెలిగించిన కూడా నీచు వాసన పోతుంది.
పచ్చ కర్పూరంతో..:ఒక పాత్రలో కొన్ని నీళ్లు పోసి అందులో పచ్చ కర్పూరం వేసి ఇంట్లో ఓ మూలకు పెట్టండి. దీంతో మంచి వాసన వస్తుంది. ఇలా చేయడం వల్ల మరో ఉపయోగం కూడా ఉంది, అదేంటంటే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.