తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలా? ఇవి తింటే హెల్త్​తో పాటు అందం మీ సొంతం!

Summer Healthy Food : వేసవిలో డీహైడ్రేషన్, వడదెబ్బతో పాటు చర్మ సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ మార్పులు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

Summer Healthy Food
Summer Healthy Food

By

Published : May 17, 2023, 4:04 PM IST

Summer Healthy Food : ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఉక్కబోత సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుంది. దీని వల్ల చెమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరం నుంచి నీళ్లు బయటకు వస్తాయి. శరీరంలో నీటి శాతం తక్కువ కావడం వల్ల చాలామంది డీహైడ్రేషన్‌కు గురవుతూ ఉంటారు. వేసవి కాలంలో డీహైడ్రేషన్ వల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. డీహైడ్రేషన్‌తో పాటు వడదెబ్బకు గురై చాలామంది అనారోగ్యం బారిన పడతారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు మన శరీరం, ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వాతావరణాన్ని బట్టి మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకున్నప్పుడే అనారోగ్యాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోగలం. ఎండాకాలంలో శరీరం చల్లబడటానికి శీతల పానీయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే శరీరానికి చల్లదనం అందించే పుచ్చకాయ, ఇతర పండ్లను తీసుకుంటారు..

పుచ్చకాయ, ఖర్బూజ దానిమ్మ వల్ల ప్రయోజనాలు..
ఎండ ప్రభావం నుంచి తట్టుకోవడానికి శరీరానికి చల్లదనం అందించే, నీటి శాతం ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. పుచ్చకాయ, ఖర్బూజ, మామిడికాయ, దానిమ్మ, జామకాయ లాంటి నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉండదని వైద్యులు చెబుతున్నారు.

కీరదోస, క్యారెట్, సోరకాయ, బీరకాయతో లాభాలు..
ఇక కూరగాయల్లో కీరదోస, దోసకాయ, క్యారెట్, సోరకాయ, బీరకాయలు వంటి నీటిశాతం అధికంగా ఉండేవి. అవి తీసుకుంటే వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కీరదోసను ముక్కలుగా చేసుకుని సలాడ్‌గా తీసుకోవచ్చు. కీరదోస ముక్కలను కంటి మీద పెట్టుకుంటే శరీరం, కంట్లోని వేడిని లాగేస్తుంది. దీని వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు.

వేసవిలో క్యారెట్‌ కూడా శరీరానికి చల్లదనం కలిగిస్తుంది. దీనిని సలాడ్‌ లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. దోసకాయలో కూడా చలవ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. దీనిని పప్పు, చట్నీ, కూరల్లో వాడి తీసుకోవడం వల్ల చలవ చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

రెడ్ క్యాప్సికం :
ఎండాకాలంలో చర్మం ముడతలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెడ్ క్యాప్సికం ఎక్కువగా తీసుకోవడం వల్ల వేసవిలో చర్మ సౌందర్యం పెరుగుతుంది. రెడ్ క్యాప్సికంలో సీ విటమన్ ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో చర్మాన్ని కాపాడుతుంది. కమలా పండులో నీటి శాతం ఎక్కువ ఉండడం సహా విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. వేసవిలో కమలా పండును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

తాటి ముంజలు :
ఇక వేసవిలో తాటి ముంజలు తినడం వల్ల చలవ చేస్తుంది. అలాగే ఎండకు చాలా మందికి చెమట కాయలు లాంటివి శరీరంపై వస్తాయి. ఇలాంటి సమయాల్లో తాటి ముంజలను పేస్టులా చేసుకుని చెమట కాయలు వచ్చిన చోట పెడితే అవి తగ్గుతాయి. వేసవిలో చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి. టమాటొ, క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయాల నుంచి బీటా కెరోటిన్ లభిస్తుంది. వీటితో పాటు మంచినీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల వేసవిలో డీహైడ్రేషన్ నుంచి బయటపడడం సహా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details