How Teeth Affect Digestion System : తిన్న తిండి సరిగ్గా జీర్ణం కావాలంటే జీర్ణవ్యవస్థ హెల్తీగా ఉండాలి. కానీ, ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు జీర్ణవ్యవస్థపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. దాంతో.. చిన్న వయసులోనే షుగర్, బీపీ, గ్యాస్(Gas Trouble), ఎసిడిటీ వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. అయితే.. అందరూ పేగులు ఆరోగ్యంగా ఉంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందనుకుంటారు. కానీ.. చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. జీర్ణక్రియ సరిగ్గా జరగడంలో నోరు ముఖ్య పాత్ర పోషిస్తుందట. అలాగే దంతాలు కూడా జీర్ణవ్యవస్థను ఎంతో ప్రభావితం చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నమలడం :మనం తీసుకునే ఆహారాన్ని సరిగ్గా నమలడంలో దంతాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చాలా మంది సరిగ్గా నమలకుండా అలాగే మింగుతుంటారు. అది మంచిది కాదు. అలాకాకుండా మీరు తీసుకున్న ఫుడ్‌ను బాగా నమలాలి. అలా చేయడం ద్వారా ఘన పదార్థాలు చిన్న ముక్కులుగా మారుతాయి. అప్పుడు దాని ఉపరితల వైశాల్యం పెరిగి పొట్టలోని జీర్ణ రసాలు మెరుగ్గా పనిచేస్తాయి. దాంతో జీర్ణక్రియ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇలా మీరు చేసినప్పుడు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దాంతో జీర్ణక్రియ త్వరగా జరిగి కావాల్సిన పోషకాలు అందించడంతో పాటు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
బోలస్ ఏర్పాటు : ఇక మీరు తీసుకున్న ఆహారాన్ని దంతాలు క్రషింగ్, గ్రైండింగ్ చేస్తున్నప్పుడు నోటిలోని గ్రంథులు మరింత లాలాజాలాన్ని ఉత్పత్తి చేస్తాయి. అలా వచ్చిన లాలాజలం ఆ ఫుడ్‌ను ఒక ముద్దలాగా తయారుచేస్తుంది. దానినే బోలస్ అంటారు. ఇలా అయినప్పుడు మాత్రమే మనం తీసుకున్న ఫుడ్‌ను మింగడానికి ఈజీగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ పోషకాలను గ్రహించడానికి కూడా ఈ బోలస్ తోడ్పడుతుంది.
మీరు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - మీ పేగుల్లో విషం నింపుతునట్టే!