బరువు పెరగాలంటే ఎవరేది చెప్తే అది పాటించడం కాదు.. మీకంటూ కొన్ని నియమాలు పెట్టుకోవాలి. అలా చేయాలంటే.. ముందు మీరు ఈ వాస్తవాలు తెలుసుకోవాలి..
అపోహ:పిండిపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు!
వాస్తవం:ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ పిండిపదార్థాలు శరీరానికి అవసరమైనంత తీసుకోవాలి. అలా కాకుండా మాంసకృత్తులూ, కొవ్వులు ఏవి ఎక్కువగా తీసుకున్నా కూడా అవి శరీరంలో నిల్వగా మారతాయి. అలా కూడా బరువు పెరుగుతారు. అంతేగానీ పూర్తిగా పిండిపదార్థాల్ని దూరంగా పెట్టమని మాత్రం నిపుణులు చెప్పరు.
అపోహ: మాంసకృత్తులు ఉన్న పానీయాలు తాగితే కండలు వస్తాయా?
వాస్తవం: కండలు అనేవి వ్యాయామం సరిగా చేస్తూ తగిన ఆహారం తీసుకుంటే వస్తాయి. నిజానికి ఎవరైనా సరే 0.8గ్రా నుంచి 1.0గ్రా చొప్పున ప్రతి కేజీ బరువుకు మాంసకృత్తులు తీసుకోవాలి. అలా కాకుండా అతిగా తీసుకున్నా మంచిదికాదు. కణజాలం దెబ్బతినే ప్రమాదముంటుంది. బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువే.