How Often You Should Replace Mattress : మనం ఆరోగ్యంగా జీవించడానికి రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం. కానీ.. ప్రస్తుతం చాలా మంది పని ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే వీటికితోడు తగిన నిద్రలేకపోవడానికి మీ బెడ్ రూమ్‌లో ఉండే పరుపు(Mattress)కూడా కారణమవుతుందని అంటున్నారు నిపుణులు!
దాదాపు అందరి ఇళ్లలో బెడ్స్ ఉంటాయి. వాటిపై కొందరు మామూలు పరుపులు యూజ్ చేస్తుంటే, ఇంకొందరు బ్రాండెడ్‌వి వాడుతుంటారు. అయితే సాధారణంగా దుప్పట్లు, దిండ్లు మాసిపోతేనో లేదంటే ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుంటేనో ఉతుకుంటారు. అవసరమైతే మార్చుతుంటారు. కానీ.. పరుపులను మాత్రం దీర్ఘకాలం వాడుతూనే ఉంటారు. కానీ అది సరికాదంటున్నారు. పరుపులను కూడా వాటి జీవిత కాలం అయిపోగానే మార్చాలంట. మరి.. వాటి జీవితకాలం అయిపోయిందని ఎలా గుర్తించాలో చూద్దాం.
బ్యాడ్ స్మెల్ :మనం ఎక్కువ రోజులు ఏవైనా దుస్తువులు యూజ్ చేస్తే బ్యాడ్ స్మెల్స్ వస్తుంటాయి. అలాగే మీరు యూజ్ చేసే పరుపు కూడా అసహ్యకరమైన వాసనలు వెదజల్లుతుందంటే.. దాని లైఫ్‌టైమ్ అయిపోయిందని గమనించాలి. అప్పుడు వీలైనంత త్వరగా మార్చేయాలి.
ఎత్తు పల్లాలు : మీరు చాలా కాలంగా ఒకే పరుపును యూజ్ చేస్తుంటే.. అది బాగా అణిగిపోయి ఉంటుంది. దాంతో పరుపు మొత్తం ఎత్తుపల్లాలుగా మారుతుంది. నిద్రపోవడానికి ఇబ్బందిగా మారుతుంది. ఇలా పరుపు ఇబ్బంది పెడితే.. దాని జీవితకాలం అయిపోయిందని గమనించి, మరోదాన్ని తీసుకోవడం బెటర్. లేదంటే మీరు ఆ పరుపు మీద ప్రశాంతంగా నిద్రపోలేరు.
కంటి నిండా నిద్రపోవాలా? మీరు తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ ఇదే!
వెన్నునొప్పి : పరుపు లైఫ్‌టైమ్ అయిపోయిందని సూచించే మరో సంకేతం.. మీరు ఉదయం లేవగానే వెన్నునొప్పి ఇబ్బందిపెట్టడం. ఎందుకంటే దానిమీద రోజూ నిద్రించడం వల్ల అది దగ్గరికి అవుతుంది. అప్పుడు ఆ పరుపుపై సమాంతరంగా పడుకోలేం. దాంతో వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ పరుపు జీవితకాలం అయిపోయిందని గమనించాలి.