తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఎన్ని నెలలకు బ్రష్ మార్చాలి?.. ఎంతసేపు పళ్లు తోముకోవాలి? - టూత్ బ్రష్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ చేసే పని బ్రష్ చేయడం. ఆ తర్వాత ఏ పనినైనా ప్రారంభిస్తారు. అయితే బ్రష్​ను కొందరు నెలల కొద్ది వాడుతుంటారు. అయితే బ్రష్​ను ఎన్ని నెలకొకసారి మార్చాలి. ఎలాంటి బ్రష్​ను ఉపయోగించాలి. రోజుకు ఎన్ని సార్లు బ్రష్ చేయాలో ఓ సారి తెలుసుకుందాం.

toothbrush replacement time
బ్రష్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

By

Published : Mar 10, 2023, 3:48 PM IST

నోటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం తిన్న ఆహారం నోటి నుంచి కడుపులోకి చేరుతుంది. దీనికి మనం ముందుగా చేయాల్సిన పని.. బ్రష్​ను ఎప్పటికప్పుడు మార్చడం. అలాగే బ్రష్​ను శుభ్రంగా ఉంచుకోవడం. నాణ్యమైన బ్రష్​లను ఉపయోగించడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే బ్రష్​ను రోజుకు రెండు సార్లు చేయమని చెబుతున్నారు నిపుణులు.

టూత్​ బ్రష్​ విషయంలో చాలా మంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. నాలుగైదు నెలలకోసారైనా బ్రష్​ను మార్చాలి. ముఖ్యంగా అది రంగుమారినా, కుచ్చులు ఊడినా, వంకరపోయినా.. పక్కన పారేయాలి. లేదంటే అవి మన పళ్లకు హానికరంగా మారతాయి. చిగుళ్లను గాయపరుస్తాయి.

దంతాలను శుభ్రం చేసుకునేందుకు ఎలక్ట్రిక్ బ్రష్​ను వాడడం మేలు. నాణ్యమైన బ్రష్​ను వాడడం వల్ల దంత రక్షణకు మేలని నిపుణలు చెబుతున్నారు. రోజుకు రెండుసార్లు.. కనీసం రెండు నిమిషాలపాటు బ్రష్ చేయాలి. అలాగే బ్రష్​ను ప్రతీ మూడు లేదా నాలుగు నెలలకసారి మార్చాలని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (ఏడీఏ) చెబుతోంది.

మీరు ఇప్పుడు వాడుతున్న టూత్ బ్రష్ కొని ఎన్నాళ్ళయిందో గుర్తుందా? అది గుర్తుచేసుకుని మరి మార్చేయడం అవసరం. మార్చాల్సిన సమయం తెలిసేదెలా అంటారా? బ్రష్​ను చూస్తే అది తెలిసిపోతుంది. మీ బ్రష్​ని మీరు ఒకసారి పరిశీలించండి. దాని కుచ్చులు ఊడినా, వంకరపోయినా బ్రష్ పాడైపోయిందని అర్థం. అప్పుడు బ్రష్​ను మార్చేయడం మేలు. బాగా కోసలు వంగిపోయిన బ్రష్​.. పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార వ్యర్థాలను బయటకు తీయలేదు. ఆ వ్యర్థాలు రోజుల తరబడి పళ్ల మధ్యనే ఉండిపోతాయి. దీని వల్ల పలు రకాల దంత వ్యాధులు వస్తాయి.

బ్రష్ ఎప్పుడూ నాణ్యమైనదే కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలి. ఓ మూలన పడేసి ఉంచకూడదు. అలా పడేయడం వల్ల బాక్టీరియా చేరే అవకాశం ఎక్కువ. అందుకే బ్రష్​ను నిలబెట్టి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. నిజానికి కొన్నిరకాల టూత్ బ్రష్​లు కొన్ని కారణాల వల్ల సూక్ష్మజీవులకు అడ్డాగా మారుతుంటాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా లిజెరిన్ మౌత్ వాష్​తో శుభ్రపరిస్తే టూత్​ బ్రష్​లకు సూక్ష్మజీవుల నుంచి రక్షించుకోవచ్చు.

  • బ్రష్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి జాగ్రత్తపరుచుకోవాలి.
  • సూక్ష్మజీవులు వ్యాపించని ప్రదేశంలో టూత్ బ్రష్​ను భద్రపరచాలి.
  • గాలి బాగా తగులుతున్న ప్రదేశంలో బ్రష్​ను ఉంచాలి.
  • ఒకరు వాడిన బ్రష్​ను మరొకరు వాడకూడదు.

నోటి శుభ్రత కోసం..
ఎక్కువమంది సాధారణ టూత్ బ్రష్​లను వాడుతుంటారు. అయితే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్​లను వాడడం మేలని కొందరు నిపుణలు చెబుతున్నారు. ఎందుకంటే వాటితో పంటి శుభ్రత, చిగుళ్ల సంరక్షణ ఎక్కువని అంటున్నారు. దంతక్షయాన్ని కొంతమేర నియంత్రిస్తాయని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details