How many times sex in a day is healthy: సెక్స్‌లో పాల్గొంటే వచ్చే తృప్తి మాటల్లో వర్ణించలేనిది. అయితే రోజులో ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొంటే మంచిదో అనే అనుమానం మీలో ఉందా? వైద్యుల సమాధానం ఏంటో తెలుసుకోండి.
"సెక్స్‌లో పాల్గొనడానికి ఇన్నిసార్లు అని లిమిట్ ఏమీ ఉండదు. కోరిక, సామర్థ్యం ఉంటే ఎన్నిసార్లైనా పాల్గొనవచ్చు. కొత్తగా పెళ్లి అయినవారైతే రోజులో మూడు-నాలుగు సార్లు పాల్గొంటుంటారు. నిజంగా మనసు పడి రతిలో పాల్గొంటే దంపతులు పొందే తృప్తి మాటల్లో వర్ణించలేనిది. మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఓపిక ఉంటే ఎన్నిసార్లు అయినా పాల్గొనవచ్చు. సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎవరూ నీరసపడరు. ఇంకా చెప్పాలంటే రతి వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆరోజు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఎందుకంటే సెక్స్ వల్ల ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి." అని అంటున్నారు నిపుణులు. శృంగార జీవితానికి సంబంధించిన మరిన్ని ప్రశ్నలకు వారి జవాబులు ఇలా ఉన్నాయి..
శృంగార జీవితం మెరుగయ్యేందుకు ఏం తినాలి?
- సోయా, చేపలు వంటివి సెక్స్ హార్మోన్ల మోతాదులు పెరిగేలా చేస్తాయి.
- పలుచటి ప్రొటీన్లతో కూడిన కోడి మాంసం వంటి వాటిలో టైరోసైన్, ఫినైల్ అలనైన్ ఉంటాయి. ఇవి శృంగారాసక్తి పెరిగేలా చేస్తాయి.
- తక్కువ కొవ్వు గల పెరుగు, గుడ్ల వంటివాటిలో కొలైన్ ఉంటుంది. శృంగార కాంక్షను నియంత్రించే రసాయనానికి ముందు రూపం ఇదే.
- పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, ఎక్కువ పీచుతో కూడిన పదార్థాల్లో గ్లుటమైన్, ఐనోసిటాల్ ఉంటాయి. భావప్రాప్తికి చేరుకునే దశలో స్థిమితంగా ఉండటానికి తోడ్పడే రసాయనం వీటి నుంచే పుట్టుకొస్తుంది.