తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మధుమేహంతో శృంగారానికి భంగం.. హెచ్చరిస్తున్న నిపుణులు! - మధుమేహం వల్ల సెక్స్​ సమస్యలు

మధుమేహం దీర్ఘకాలంగా నియంత్రణలో లేనివారికి గుండె జబ్బులు, నాడులు దెబ్బతినటం వంటి సమస్యలెన్నో చుట్టుముడుతుంటాయి. అంతేనా? మగవారిలో, ఆడవారిలో శృంగార సమస్యలనూ తెచ్చిపెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.

how-does-diabetes-affect-sex-life
how-does-diabetes-affect-sex-life

By

Published : Nov 23, 2022, 9:46 AM IST

మధుమేహం మూలంగా మగవారిలో టెస్టోస్టీరాన్‌ మోతాదులు తగ్గుతాయి. శృంగారం మీద ఆసక్తి, ఉత్సాహం సన్నగిల్లుతుంది. కుంగుబాటు, ఆందోళన, నిస్సత్తువ, బరువు పెరగటం, తరచూ మూత్ర ఇన్‌ఫెక్షన్లు, స్తంభన లోపం, సంతాన సామర్థ్యం తగ్గటం వంటివీ పొడసూపుతాయి. ఇక ఆడవారిలో శారీరకంగా, మానసికంగానూ సమస్యలు మొదలవుతాయి. శృంగార వాంఛ లోపించటం, యోని పొడిబారటం, సంభోగ సమయంలో నొప్పి, మూత్రకోశ ఇన్‌ఫెక్షన్ల వంటివి వేధిస్తుంటాయి.

మామూలు వారితో పోలిస్తే అండాశయాల్లో నీటితిత్తులు (పీసీఓఎస్‌) గల యువతుల్లో మధుమేహం 10 రెట్లు ఎక్కువ! పీసీఓఎస్‌ బారినపడ్డ వారిలో కణాలు ఇన్సులిన్‌ను గ్రహించక పోవటం, దీంతో రక్తంలో ఇన్సులిన్‌ మోతాదు పెరగటం గర్భధారణకు విఘాతం కలిగిస్తుంటాయి. నెలసరి సమయంలో అండం విడుదల కాకుండా అడ్డుకుంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఇలాంటి దుష్ప్రభావాలను అధిగమించొచ్చు.

  • క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ గ్లూకోజు మోతాదులను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైతే ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకోవటానికి వెనకాడొద్దు.
  • ఆకుకూరలు, కూరగాయలు, క్యారట్లు, చిక్కుళ్లు, బటానీలు, బ్రోకలీ, తాజా పండ్లు, గింజపప్పుల వంటివి తీసుకోవాలి. వీటితో పీచు ఎక్కువగా లభిస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజు త్వరగా కలవకుండా చూస్తుంది.
  • రోజూ వ్యాయామం చేయటం తప్పనిసరి. ధ్యానం, యోగాలను జత చేసుకుంటే ఇంకా మంచిది.
  • కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల ముందు కూర్చోవటం తగ్గించుకోవాలి.
  • తగినంత సేపు, కంటి నిండా నిద్ర పోవాలి.
  • పొగ, మద్యం, అతిగా కెఫీన్‌ తీసుకోవటం వంటి అలవాట్లుంటే మానుకోవాలి.
  • మంచి పుస్తకాలు చదవటం, శ్రావ్యమైన సంగీతం వినటం వంటి ఒత్తిడిని తగ్గించే పనులు చేయాలి.
  • మగవారిలో స్తంభనలోపం, ఆడవారిలో అసంకల్పితంగా యోని కండరాలు సంకోచించటం వంటి సమస్యలుంటే చికిత్స తీసుకోవాలి.
  • శృంగార సమస్యల గురించి ఏవైనా ఆందోళనలకు గురవుతుంటే మానసిక నిపుణుల సలహా తీసుకోవాలి.
  • సురక్షితమైన శృంగారానికి కండోమ్‌ల వంటివి వాడుకోవాలి. భాగస్వామితో శృంగార జీవితానికి కట్టుబడి ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details