ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక మహిళగా ఆందోళన చెందడం, బాధపడడం సహజమే. అదే పరిస్థితి మీకూ ఎదురైంది. కానీ ఇక్కడ మీరు రియాక్ట్ అవడం కంటే రెస్పాండ్ అవడం మంచిది. అంటే ఆయనతో గొడవపెట్టుకోవడం, వాదులాటకు దిగడం వంటివి చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీ భర్తపై మీకున్న సందేహాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను ముందుగా సంపాదించాలి. అంటే.. మీ భర్తకు ఆ అమ్మాయితో మీరనుకుంటున్న సంబంధం నిజంగానే ఉందా? ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన రుజువులేమైనా ఉన్నాయా? అవన్నీ సంపాదించుకొని, మీ దగ్గర పెట్టుకొని, ఆపై తనతో ఈ విషయం గురించి మాట్లాడడం ఉత్తమం.
ఎప్పుడు చూసినా ఆమెతోనే.. ఆయన్ని మార్చేదెలా? - భార్యాభర్తల గొడవలు
హాయ్ మేడమ్.. మా పెళ్లై 10 సంవత్సరాలవుతోంది. మా ఆయన మొదటి రెండు సంవత్సరాలు బాగానే ఉన్నాడు. మొదటి కాన్పు తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. ప్రతి విషయానికీ నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. ఆయన వేరే అమ్మాయితో ఫోన్‌లో ఛాట్ చేస్తున్నాడని తెలిసింది. భవిష్యత్తులో నన్ను, పిల్లలను ఏం చేస్తాడో అని భయంగా ఉంది. ఆయన ఛాట్ చేసే అమ్మాయితో నేను మాట్లాడొద్దని చెప్పచ్చా? ఒకవేళ చెబితే నాకేమైనా సమస్యలొస్తాయా? ఆయనలో మార్పు తీసుకురావడానికి ఏం చేయాలో సలహా ఇవ్వండి.
![ఎప్పుడు చూసినా ఆమెతోనే.. ఆయన్ని మార్చేదెలా? wife and husband problems](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7620881-1094-7620881-1592198505921.jpg)
మీ భర్త వేరే అమ్మాయితో ఛాట్ చేయడం వల్ల భవిష్యత్తులో మిమ్మల్ని వదిలేస్తాడేమో అన్న భయం, చింత మీ మనసులో ఉందంటున్నారు. దానివల్ల మీ భర్తపై మీకు అనుమానం మరింతగా పెరిగే అవకాశం ఉంది. అలాగే లేనిపోని ఆలోచనలతో మీ మనసూ పాడవుతుంది. కాబట్టి అలా ఆలోచించడానికి బదులుగా.. ముందు అసలు విషయం ఏమిటో, మీ అనుమానం నిజయో కాదో నిర్ధారించుకోండి. పాజిటివ్‌గా ఆలోచించండి. ఒకవేళ మీ అనుమానం నిజమే అని నిర్ధారణ అయిన పక్షంలో ఆయన మనసు మారే అవాకశం ఉందేమో తెలుసుకోండి. సయోధ్య కోసం సామరస్యంగా ప్రయత్నించండి. అలా చెప్పినా ఆయన వినకపోతే, మీ అనుబంధం బీటలు వారుతోందనిపిస్తే.. మీ భర్త గురించి మీరు సంపాదించిన సాక్ష్యాధారాలను తీసుకొని భరోసా సెంటర్ లేదా షీటీమ్స్‌ని సంప్రదించచ్చు. తద్వారా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది.