తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

జలుబుతో బాధపడుతున్నారా ? ఒక్కసారి ఈ హోమ్‌ టిప్స్ పాటించండి! - how to stop cold

Home Remedies To Stop Cold : చలికాలం వచ్చిందంటే చాలా మందిలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి బయట మార్కెట్లో దొరికే ఎన్నో మందులను వాడుతుంటారు. కానీ, వీటివల్ల తొందరగా ప్రభావం కనిపించకపోవచ్చు. జలుబును ఫాస్ట్‌గా తగ్గించే చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Home Remedies To Stop Cold
Home Remedies To Stop Cold

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 11:38 AM IST

Home Remedies To Stop Cold : శీతాకాలంలో ఎక్కువ మందిని వేధించే సమస్యల్లో జలుబు ఒకటి. ఈ జలుబు ఒక్కసారి వచ్చిందంటే చాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కొంత అసౌకర్యంగా ఉండటం మొదలవుతాయి. ఇది కొందరిలో వారం రోజుల్లో తగ్గితే, మరి కొందరిలో నెలరోజులైనా విడిచి పెట్టి వెళ్లదు. అసలు ఈ సమస్య నుంచి తొందరగా గట్టెక్కడానికి ఏమైనా మార్గాలు లేవా ? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇంట్లో ఉపయోగించే కొన్ని పదార్థాలతో జలబును ఒక్క రోజులో ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక అధ్యయనం ప్రకారం ఏడాదిలో పెద్దలు మూడు సార్లు, చిన్నపిల్లలు అయితే పది లేదా అంతకంటే ఎక్కువ సార్లు జలుబుతో బాధపడతుంటారని వెల్లడైంది. కాబట్టి, ప్రతి ఒక్కరు జలుబు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది చలికాలంలో తక్కువ నీళ్లను తాగుతుంటారు. కానీ, కాలాలతో సంబంధం లేకుండా అన్ని సీజన్‌లలో మనిషి శరీరంలో తగినంత నీరు ఉండటం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ప్రతి రోజు ఎక్కువగా మంచి నీళ్లు తీసుకునేటట్లు చూసుకోవాలి.

జలుబును తొందరగా తగ్గించే చిట్కాలు..

  • జలుబు చేసినప్పుడు తేనెతో కలిపిన నీళ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులంటున్నారు.
  • జలుబుతో బాధపడుతున్నవారు వేడి నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలుపుకొని తాగాలి. దీనివల్ల తొందరగా జలుబు నుంచి ఉపశమనం పొందుతారు. పసుపులో ఉండే యాంటీబాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు నుంచి విముక్తి కలిగిస్తాయి.
  • అలాగే రెండు చెంచాల తేనె, ఒక చెంచాడు నిమ్మరసాన్ని వేడి నీళ్లు లేదా వేడి పాలలో కలిపి తాగడం వల్ల కూడా జలుబు, దగ్గు నుంచి రిలీఫ్‌ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
  • జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారికి అల్లం టీ ఎంతో రిలీఫ్‌ను ఇస్తుంది. దీనికోసం మీరు కొన్ని అల్లం ముక్కలను తీసుకోని వాటిని టీలో లేదా వేడి నీటిలో లేదా పాలలో కలిపి తీసుకోండి. మిశ్రమాన్ని బాగా మరిగించాలని గుర్తుంచుకోండి.
  • గొంతునొప్పితో బాధపడుతున్నవారు ఒక గ్లాసు నీళ్లలో పావు టీస్పూన్‌ ఉప్పు వేసి బాగా కలపి, ఆ నీళ్లను పుక్కిలిస్తే ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
  • జలుబు చేసిన వారు రోగనిరోధక శక్తి కోసం గుమ్మడి గింజలు, పప్పు ధాన్యాలు, బాదం, చేపలు వంటి వాటిని తీసుకోవాలి. ఇందులో జింక్‌ అధికంగా ఉంటుంది.
  • బీట్‌రూట్‌ జ్యూస్‌లో డైటరీ న్రైట్రేట్‌ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెంచుతాయి. అలాగే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఒక అధ్యయనంలో భాగంగా జలుబుతో బాధపడుతున్న 120 మందికి రెండు వారాల పాటు రోజుకు రెండుసార్లు 250 మిల్లీ లీటర్ల బీట్‌రూట్‌ జ్యూస్‌ను అందించారు. ఇలా చేయడం వల్ల వారిలో జలుబు, తలనొప్పి లక్షణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
  • జలుబు ఉన్నవారు తొందరగా ఉపశమనం పొందడానికి టాబ్లెట్లను తీసుకోవడం కంటే నాజిల్ స్ప్రేలు ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. ఇవి జలుబుకు సంబంధించిన బ్యాక్టీరియాను చంపి ఉపశమనం కలిగిస్తాయని అంటున్నారు.
  • వీటన్నింటి కంటే తేలికైన చిట్కా ఉంది, అదే గోరు వెచ్చని నీళ్లను తాగడం. అవునండి జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • అలాగే ఎన్ని మందులు వేసుకున్నా, చిట్కాలు పాటించినా కూడా తగిన విశ్రాంతి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details