తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

అవాంఛిత రోమాలా? ఆందోళన వద్దు! ఈ ప్యాక్స్​ ట్రై చేస్తే ప్రాబ్లెమ్​ సాల్వ్​! - Home Remedies to Remove Unwanted Hair

Unwanted Hair Removal Tips: అవాంఛిత రోమాలు... ఇది చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్య. చేతులు, పై పెదవిపై, చుబుకం కింద, చెంపలకు పక్కగా ఈ సమస్య ఎదురవుతుంది. మరి ఈ సమస్య పరిష్కారం కోసం.. ఈ టిప్స్​ పాటిస్తే సరి..

Unwanted Hair Removal Tips
Unwanted Hair Removal Tips

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 11:25 AM IST

Tips to Remove Unwanted Hair: అందంగా.. చందమామ లాంటి మెరుపుతో కూడిన ముఖం కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే, చాలా మంది అమ్మాయిలు అవాంఛిత రోమాలతో ఇబ్బందిపడుతూ ఉంటారు. పెదవి పై భాగంలో, గడ్డం దగ్గర, చెంపల మీద వెంట్రుకలు పెరిగి చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి అమ్మాయిలు థ్రెడింగ్‌, వ్యాక్సింగ్‌.. అంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ పద్ధతులతో విపరీతమైన నొప్పి భరించాల్సి ఉంటుంది. అంతేకాదు, వీటి వల్ల అవాంఛిత రోమాలు రెట్టింపు వేగంతో పెరుగుతాయి. అసలు ఈ అవాంఛిత రోమాలు రావడానికి కారణాలు ఏంటి..? ఈ హెయిర్‌ను తొలగించుకోవడానికి పాటించాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.​

యవ్వనంలో స్లిమ్​గా ఉండి - ఆ తర్వాత బరువు పెరిగారా? అసలైన కారణమిదే!

Home Remedies to Remove Unwanted Hair: చాలా మందికి హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్, జన్యుశాస్త్రం కారణంగా అవాంఛిత రోమాలు వస్తుంటాయి. మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపించేందుకు కారణం పీసీఓడీ. పీసీఓడీ సమస్యలో మాత్రం టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఎక్కువ కావడంతో శరీరంపై రోమాల పెరుగుదల అధికంగా కనిపిస్తుంది. కొందరిలో ఈ హార్మోన్‌ తక్కువ స్థాయిలో ఉన్నా సమస్య ఎదురవుతుంది. అలాగే చంటిపిల్లలుగా ఉన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా నూనె రాసి సున్నిపిండి నలుగు పెట్టే అలవాటు తగ్గినా... లేకపోయినా ఈ సమస్య రావచ్చు. వీటిని దూరం చేసేందుకు ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి.

బొప్పాయి మాస్క్..:బొప్పాయి, పసుపు మాస్క్ జుట్టు కుదుళ్లని బలహీనపరుస్తుంది. కాబట్టి, దీనిని కూడా వాడొచ్చు. పండిన బొప్పాయి పండుని పేస్టులా చేయండి. ఇందులో పసుపును కలపి మాస్క్‌లా చేయండి. దీనిని ఫేస్‌పై అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలానే ఉంచి క్లీన్ చేయండి.

మీకు బ్లూ టీ గురించి తెలుసా? బరువు తగ్గి నాజూగ్గా మారిపోతారు!

షుగర్, లెమన్ స్క్రబ్..:చక్కెర, నిమ్మరసంతో తయారు చేసిన స్క్రబ్ కూడా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ముఖంపై వెంట్రుకల్ని దూరం చేస్తుంది. ఈ ప్యాక్ కోసం చక్కెర, నిమ్మరసాన్ని బాగా మిక్స్ చేయండి. దీనిని ముఖంపై స్క్రబ్ చేయండి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయండి.

ఎగ్ మాస్క్..:చర్మాన్ని బిగుతుగా మార్చే గుణాలు గుడ్డులో ఉన్నాయి. గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా చక్కెర పిండి, మొక్కజొన్న పిండి వేసి మాస్క్‌లా వేయండి. ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత పీల్ మాస్క్‌లా తీసేయండి. దీని వల్ల ఫేషియల్ హెయిర్ దూరమై చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది.

పసుపు, పాలు..:అన్ వాంటెడ్ హెయిర్‌ని రిమూవ్ చేయడంలో ఈ రెండు కూడా చాలా బాగా పనిచేస్తాయి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. పాలు ఎక్స్‌ఫోలియేట్‌గా పనిచేస్తాయి. ఈ రెండింటిని కలిపి సమస్య ఉన్న దగ్గర అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలానే ఉంచి గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోండి.

ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తే - పార్లర్​కు వెళ్లకుండానే మెరిసే అందం మీ సొంతం!

ఓట్స్, బనానా..:ఓట్స్‌లో అరటిపండు కలపాలి. దీనిని స్క్రబ్‌లా చేయొచ్చు. ముందుగా ఈ రెండింటిని బాగా కలపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయండి.

​గమనిక:నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం బెటర్​..

చలికాలంలో చర్మం పొడిబారుతోందా? చుండ్రు​ సమస్య వెంటాడుతోందా? ఈ టిప్స్ మీకోసమే!

మొటిమలు, నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? - ఇలా ఈజీగా పోగొట్టండి!

ABOUT THE AUTHOR

...view details