తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చుండ్రు సమస్య వేధిస్తోందా? ఇలా ట్రై చేస్తే ఎలాంటి ఖర్చు లేకుండా సమస్యకు చెక్​ పెట్టొచ్చు!

Dandruff Removing Tips: చాలా మంది నిత్యం చుండ్రుతో బాధపడుతుంటారు. చలికాలంలో ఈ సమస్య ఎక్కువవుతుంది. ఎన్ని షాంపులు వాడినా ఫలితం ఉండదు. అలాంటి సమయంలో ఇంట్లో దొరికే కరివేపాకుతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 5:23 PM IST

Dandruff Removing Tips
Dandruff Removing Tips

Dandruff Removing Tips in Telugu: చుండ్రు (Dandruff) మనలో చాలా మందిని కలవర పెట్టే సమస్య. అందులోనూ ప్ర‌స్తుత చ‌లికాలంలో ఈ స‌మ‌స్య మ‌రింత అధికంగా ఉంటుంది. చుండ్రు కారణంగా తలలో తీవ్రమైన దురద ఉంటుంది. జుట్టు డ్రై అయిపోతుంది. హెయిర్ ఫాల్ రెట్టింపు అవుతుంది. అందుకే చాలా మంది చుండ్రు అంటేనే చిరాకు పడుతుంటారు. చుండ్రును వదిలించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు. అయితే ఇప్పుడా టెన్షన్​ అక్కర్లేదు. కేవలం ఇంట్లో లభించే కరివేపాకు ఉపయోగించి ఒక్క వాష్ లోనే సులభంగా చుండ్రును వదిలించుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పోషకాల గని: కరివేపాకులో ప్రోటీన్, విటమిన్లు, ఐరన్, బీటా కెరోటిన్, కాల్షియంతో పాటు ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు లభిస్తాయి. దీంతో పాటు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా లభిస్తాయి. కాబట్టి కరివేపాకును మిశ్రమంలా తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

నిద్రపోయేప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? జాగ్రత్త- మొటిమల సమస్య అధికమవుతుంది!

చుండ్రు సమస్యల కోసం:

కరివేపాకు, పెరుగు:కరివేపాకు, పెరుగును మిశ్రమంలా తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా జుట్టుకు వినియోగించడం వల్ల చుండ్రు సమస్యలు కూడా దూరమవుతాయి. అంతే కాకుండా తెల్ల జుట్టు నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి జుట్టు రాలడం, ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కరివేపాకు మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది.

వింటర్​లో కర్లీ హెయిర్ సంరక్షణ - ఇలా చేస్తేనే స్టైల్​గా ఉంటుంది!

ఎలా తయారు చేయాలంటే:

  • పెరుగు, కరివేపాకు హెయిర్ ప్యాక్ సిద్ధం చేయడానికి, ముందుగా కొన్ని కర్రీ లీవ్స్​ను నీటిలో 20 నిమిషాలు నానబెట్టండి.
  • ఆ తరువాత, కరివేపాకును బాగా గ్రైండ్ చేసి, రెండు చెంచాల పెరుగు వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి.
  • ఇప్పుడు ఈ పేస్ట్‌ను మీ జుట్టు కుదుళ్ల నుంచి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత వాష్​ చేసుకోవాలి.

అవాంఛిత రోమాలా? ఆందోళన వద్దు! ఈ ప్యాక్స్​ ట్రై చేస్తే ప్రాబ్లెమ్​ సాల్వ్​!

కరివేపాకు నీరు:కరివేపాకును ఉడకబెట్టి ఆ నీటీ జుట్టుకు పట్టించడం వల్ల జుట్టులోని చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాల వల్ల ఇన్ఫెక్షన్లు కూడా దూరమవుతాయి. కాబట్టి తల స్నానం చేయడానికి ముందు ఈ నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు రాలకుండా కూడా ఉంటుంది.

ఎలా తయారు చేయాలంటే:

  • కొన్ని కరివేపాకులు తీసుకుని నీళ్లలో వేసి ఉడకబెట్టుకోవాలి.
  • తర్వాత ఆ నీటిని జుట్టుకు అప్లై చేసి.. అర్ధగంట తర్వాత వాష్​ చేసుకోవాలి.
  • ఇంకా మీకు చుండ్రు కనుక ఉన్నట్లు అనిపిస్తే వారానికి రెండు మూడు సార్లు ఈ రెమెడీని ప్రయత్నింవచ్చు.

స్ట్రాంగ్ ఇమ్యూనిటీ, బ్ల‌డ్ షుగ‌ర్ నియంత్రణ! క‌రివేపాకుతో ప్ర‌యోజ‌నాలెన్నో

జుట్టు ఎక్కువగా ఊడిపోతోందా? - అయితే ఇది ట్రై చేశారంటే మీ జుట్టు అస్సలు ఊడదు!

పెదవులు నల్లగా ఉన్నాయా? - ఈ టిప్స్​తో గులాబీ రేకుల్లా మారిపోతాయి!

ABOUT THE AUTHOR

...view details