తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చలికాలంలో కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా? ఈ నేచురల్​ ప్యాక్స్​తో కోమలంగా మారిపోతాయి!

Tips to Relief From Cracked Heels: చలికాలంలో చర్మం పొడిబారడం సహజం. ఈ క్రమంలోనే చాలా మందికి కాళ్ల మడమల్లో పగుళ్లు వస్తుంటాయి. కొంతమందికి విపరీతమైన నొప్పితోపాటు రక్తం కారుతుంటుంది. అయితే.. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని సహజసిద్ధమైన ప్యాక్స్‌ ప్రయత్నించాలని సూచిస్తున్నారు నిపుణులు.

Home Remedies for Cracked Heels
Home Remedies for Cracked Heels in Telugu

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 9:55 AM IST

Home Remedies for Cracked Heels in Telugu: చలికాలంలో చాలా మందిని కాలి పగుళ్ల సమస్య వేధిస్తుంటుంది. కొంతమందికి రక్తం కారుతూ విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది. మరి.. ఈ కాళ్ల పగుళ్లకు కారణాలు ఏంటి..? ఇలాంటి టైమ్‌లో ఏయే టిప్స్ పాటించి సమస్యను తగ్గించుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కాళ్ల పగుళ్లకు కారణాలు: ఎక్కువ సేపు వేడి నీళ్లతో స్నానం చేయడం, హార్ష్ గా ఉండే సోప్స్, క్రీమ్స్​ యూజ్ చేయడం, మరీ వేడీగా లేదా మరీ చల్లగా ఉండే వాతావరణం వంటివి.. పాదాల పగుళ్లకి దారి తీస్తాయి. కావలసినంత నీరు తాగకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. డయాబెటిస్, పోషకాహార లేమి, ఒబేసిటీ వంటివి కూడా పాదాల పగుళ్లకి కారణాలుగా చెప్పవచ్చు. అయితే.. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొబ్బరి నూనె లేదా వాజలీన్ పట్టించడం జనరల్​గా అందరం ఫాలో అయ్యే పద్ధతులు. కానీ.. కిచెన్​లోనే ఉండే ఇంకొన్ని పదార్థాలతో సహజసిద్ధమైన ప్యాక్స్‌ ప్రయత్నించాలని సూచిస్తున్నారు నిపుణులు.

ల్యాప్​టాప్​ ఒడిలో పెట్టుకుని వర్క్​ చేస్తున్నారా? బీ కేర్​ ఫుల్​- ఈ సమస్యలకు వెల్​కమ్​ చెప్పినట్లే!

ఇలా చేయండి:ఇప్పుడు చెప్పబోయే ప్యాక్స్​ అప్లై చేసే ముందు.. పాదాల వద్దనున్న డెడ్ సెల్స్​ని స్క్రబ్ చేయాలి. దీని కోసం వేడినీటిలో కొంత సోప్ వేసి, ఆ నీటిలో మీ పాదాలు మునిగేటట్లుగా ఉంచండి. ఆ నీరు మీరు భరించగలిగినంత వేడిగా ఉండాలి. స్కిన్ కొంత సాఫ్ట్ గా అయ్యాక ప్యుమిస్ స్టోన్​తో స్క్రబ్ చేస్తే డెడ్ స్కిన్ అంతా వచ్చేస్తుంది. ఈ పని రాత్రి చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఆ ప్యాక్స్​ ఏంటో చూద్దాం..

1. వేప, పసుపు:

కావాల్సినవి:

  • వేపాకులు - పిడికెడు
  • పసుపు - 3 టీస్పూన్లు

తయారీ:

  • ముందుగా పిడికెడు వేపాకుల్ని తీసుకుని మెత్తటి ముద్దగా చేసుకోవాలి.
  • అందులో 3 టీస్పూన్ల పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని మడమలకు పట్టించి అరగంట పాటు ఉంచాలి.
  • తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకుని, పొడిగా అయ్యాక మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

రాత్రి పూట హాయిగా నిద్ర పట్టాలా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

2. నిమ్మరసం, రోజ్‌వాటర్‌:

కావాల్సినవి:

  • నిమ్మరసం- 1 టీస్పూన్
  • గ్లిజరిన్- 1 టీస్పూన్
  • రోజ్‌వాటర్- 1 టీస్పూన్

తయారీ:

  • ఒక గిన్నెలో కాస్త గ్లిజరిన్‌లో ఒక్కో టీస్పూన్ చొప్పున నిమ్మరసం, రోజ్‌వాటర్ కలిపి మడమలకు ప్యాక్‌లా వేసుకోవాలి.
  • అలా 15 నుంచి 30 నిమిషాలు ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • టవల్‌తో శుభ్రంగా తుడుచుకుని, పొడిగా అయిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
  • ఇలా రోజూ చేస్తే మడమల్లో పగుళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.

మీకు బ్లూ టీ గురించి తెలుసా? బరువు తగ్గి నాజూగ్గా మారిపోతారు!

3. బియ్యప్పిండి, తేనె

కావాల్సినవి:

  • బియ్యం పిండి-3 టేబుల్​ స్పూన్​
  • తేనే-1 టీ స్పూన్​
  • యాపిల్ సైడర్​ వెనిగర్​-1 టీ స్పూన్​
  • ఆలివ్​ ఆయిల్​-1 టీ స్పూన్​

తయారీ:

  • రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో ఒక టీ స్పూన్ తేనె, మూడు నాలుగు చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి పేస్ట్ లా చేయండి.
  • మీ పాదాలు మరీ డ్రై గా ఉంటే ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు.
  • తరువాత ఈ పేస్ట్​తో స్క్రబ్ చేసి.. అరగంట తర్వాత క్లీన్​ చేసుకోండి.

అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? - ఈ ఆహారాలు ఔషధం!

బూడిద గుమ్మడిని కేవలం దిష్టికాయగానే చూస్తున్నారా? అయితే ఈ లాభాలు మిస్ అయినట్లే!

ఉదయాన్నే టమాటా జ్యూస్ తాగితే - ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details