Home Made Tips To Shining Nails : అందంగా కనిపించడమంటే కేవలం ముఖం మాత్రమే అనుకుంటారు కొద్ది మంది అమ్మాయిలు. దీంతో ముఖం మినహాయించి కాళ్లు, చేతులు, గోళ్లు, జుట్టు.. ఇలా మిగిలిన వాటిపై ఏ మాత్రం శ్రద్ధ తీసుకోరు. ముఖ్యంగా గోళ్ల విషయంలో ఇది కాస్తా ఎక్కువగానే ఉంటుంది. గోళ్లు పొడుగున్నా.. వాటిపై శ్రద్ధ లేక గరుకుగా, రంగు మారినట్లుగా ఉండి అందంగా కనిపించవు. అలాగే బలహీనంగా ఉండి విరిగిపోతుంటాయి. అలాంటి సమయంలో ఇతరుల గోళ్లను చూసి.. అబ్బా ఇలా మనకెందుకు లేవు అని ఫీల్ అయ్యి బ్యూటీ పార్లర్‌ను ఫాలో అవుతారు. గోళ్ల సంరక్షణ కోసం డబ్బులు అధికంగా ఖర్చు చేస్తారు. పైసలు పెట్టలేని వారు అలానే ఉండిపోతారు. ఇకమీదట గోళ్ల గురించి అలాంటి టెన్షన్ అక్కర్లేదు. డబ్బులను వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని అంతకన్నా లేదు. కేవలం ఇంట్లోనే మీ గోళ్లను మెరిసిపోయేలా ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్ చెబుతున్నారు నిపుణులు. మరి అవి ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం..
రోజ్ వాటర్ : రోజ్ వాటర్ మహిళల చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని మనందరికీ తెలిసిందే. అలాగే ఈ వాటర్‌ను మనంగోళ్ల మెరుపు కోసం కూడా ఉపయోగించుకోవచ్చంటున్నారు నిపుణులు. మీ గోళ్లు గరుకుగా, కాంతి లేకుండా ఉంటే ప్రతి రోజు రాత్రి 10 నిమిషాల పాటు రోజ్ వాటర్‌తో వాటిపై మసాజ్ చేయండి. రోజ్ వాటర్‌లో ఉండే సహజ గుణాలు, మీ గోళ్లకు పోషణను అందించి మెరిసేలా చేస్తాయి.
ఏళ్లనాటి మైగ్రేన్ బాధలు - ఇలా తిండితోనే తగ్గించుకోవచ్చు!
ఆల్మండ్ ఆయిల్ : బాదం నూనెలో ఉండే పోషకాలు మీ గోళ్లను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే గోళ్ల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. బాదం నూనెలోని మాయిశ్చరైజింగ్ లక్షణాలు గోళ్లకు మృదుత్వం, మెరుపును అందిస్తాయి. మీరు ఆల్మండ్ ఆయిల్ ప్లేస్‌లో ఆవాల నూనెను కూడా రాసుకోవచ్చు. ప్రతిరోజు మీరు రాత్రి గోళ్లను శుభ్రంగా సబ్బుతో కడిగి బాదం నూనెను గోళ్లపై రాసి రెండు మూడు నిమిషాలు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మెరిసే గోళ్లు మీ సొంతమవుతాయి.