మనలో ఉన్న మానసిక ఒత్తిడిని పారదోలి.. మనసును ఉల్లాసంగా ఉంచడానికి యోగా ఔషధంలా పనిచేస్తుంది. చాలా మంది వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను కట్టడి చేసుకునేందుకు దీనిని అస్త్రంలా ఉపయోగిస్తుంటారు. ఓ గంట సేపు యోగా చేస్తే చాలు శరీరానికి నూతన ఉత్తేజం వస్తుందని నిపుణులు పేర్కొంటారు.
ఇన్ని సద్గుణాలు ఉన్న ఈ యోగాను జీవితంలో ఓ భాగం చేసుకోవడం ఎంతో అవసరం. ఇందుకోసమే హితుల్స్ హోలిస్టిక్ సెంటర్ నిర్వాహకులు ఆన్లైన్ క్లాసులను నిర్వహించనున్నారు. సంస్థ వ్యవస్థాపకులైన డాక్టర్ వైవీ రత్నా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా యోగా పట్ల మరింత అవగాహన కల్పించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.